Tarakaratna pedda karma happening in hyderabad film nagar cultural center
Tarakaratna : ఇటీవల ఫిబ్రవరి 18న నటుడు తారకరత్న మరణించి నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని శోకాన్ని మిగిల్చాడు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తారకరత్నకు నివాళులు అర్పించారు. తారకరత్న నివాళులు, అంత్యక్రియలు కార్యక్రమాల్లో బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డి దగ్గరి బంధువు అవడంతో ఆ తర్వాత చినకర్మ సమయంలోను బాలకృష్ణ, విజయసాయిరెడ్డి కలిసి పనిచేశారు. తారకరత్న భార్యకు, ఆ కుటుంబానికి పక్కనే ఉండి భరోసా కలిపించారు.
ఇటీవల తారకరత్న పెద్దకర్మ ఆహ్వాన పత్రిక వైరల్ అయింది. అందులో తారకరత్న పెద్దకర్మ తేది, స్థలంతో పాటు ఆహ్వానితులుగా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పేర్లని రాయడంతో ఈ పత్రిక వైరల్ గా మారింది. నేడు మార్చి 2న గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమాలని కూడా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకోనున్నారు.
Tarakaratna : వైరల్ అవుతున్న తారకరత్న పెదకర్మ పత్రిక.. ఆహ్వానితులుగా బాలయ్య, విజయసాయిరెడ్డి పేర్లు
దీంతో నేడు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్దకర్మకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా రానున్నారు. తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ లో చూడొచ్చు.