Tarakaratna wife Alekhya reddy
Tarakaratna : సినీ నటుడు మరియు రాజకీయవేత్త నందమూరి హీరో తారకరత్న (Taraka Ratna) గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 23 రోజులు పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర శోకాన్ని మిగిల్చింది. తారకరత్న చనిపోయి నెల అవుతున్నా ఆ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నారు కుటుంబసభ్యులు. ఇక అతని భార్య అలేఖ్య రెడ్డి (Alekhya reddy) సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Tarakaratna : అలేఖ్య రెడ్డి వరుస పోస్ట్‌లు.. తారకరత్నతో చివరి ఫోటో!
తాజాగా మరో పోస్ట్ వేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ”నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మనం కలిశాం, ఫ్రెండ్స్ అయ్యాం, ప్రేమించుకున్నాం, ఈ ప్రయాణం ముందుకు సాగుతుందా అనే సందేహంలో ఉన్న సమయంలో.. నువ్వు ముందుకు సాగించావు. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురుకున్నావు. చివరికి పెళ్లి చేసుకున్నావు. కష్ట సమయంలో కూడా సంతోషంగా ముందుకు సాగం. నిష్కా పుట్టిన తరువాత మన జీవితం ఎంతో మారింది. కానీ సంతోషం వచ్చినా కష్టాలు వీడలేదు. ప్రతిరోజు ద్వేషాలు ఎదురుకున్నాము. అలాంటి పరిస్థితిలోనే 2019 లో ఒక అద్భుతం జరిగింది.
Balakrishna : మా ఫ్యామిలీ అని చెప్పుకునేది ఆయనని మాత్రమే.. తారకరత్న భార్య పోస్ట్!
మనకి కవలలు పుట్టారు. నాకు ఇంకా గుర్తుంది.. నువ్వు ఎప్పుడు పెద్ద కుటుంబాన్ని కోరుకునేవాడివి. నువ్వు ఆ కుటుంబాన్ని కోల్పోయావు కాబట్టే మాకు ఆ ఆనందాన్ని ఇద్దామనుకున్నావు. చివరి వరకు నీ బాధని ఎవరు అర్ధం చేసుకోలేదు. ఆఖరికి నేను కూడా నిన్ను ఆ బాధ నుంచి బయటికి తీసుకు రాలేకపోయాను. సొంత వాళ్ళే నీ మనసు బాధ పెట్టారు. మొదటి నుంచి మనతో ఎవరు ఉన్నారో, చివరిలో కూడా వాళ్ళే మిగిలారు. మనం ఎవర్ని అయితే కోల్పోయామో, వాళ్ళు నీ చివరి చూపుకు కూడా రాలేదు. నీతో ఉన్నది నేను కొంత కాలమే అయ్యినప్పటికీ నాకు ఎంతో ప్రేమ అందింది. సంతోషం ఉన్న చోట మనం మళ్ళీ కలుదాం” అంటూ పోస్ట్ పెట్టింది.