6 Journey : ‘6 జర్నీ’ మూవీ రివ్యూ..
6 జర్నీ సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Tasty Teja 6 Journey Movie Review and Rating
6 Journey Movie Review : రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మాణంలో బసీర్ ఆలూరి దర్శకత్వంలో తెరకెక్కిన 6 జర్నీ సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. హైదరాబాద్ సిటీలో పలు మర్డర్స్ డిఫరెంట్ గా జరుగుతాయి. ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కొంతమంది చెవిలో నుంచి రక్తం వచ్చి చనిపోతూ ఉంటారు. మరోవైపు సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతారు. ఇలాంటి సమయంలో ఆరుగురు యువతీయువకులు(రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & కో) సూసైడ్ చేసుకోవాలి అనుకుంటారు.
చనిపోయే ముందు గోవా వెళ్లి ఎంజాయ్ చేసి చనిపోవాలని అనుకుంటారు. ఈ ప్రయాణంలో ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇస్తారు. ఈ మర్డర్స్ అతడే చేశాడని వీళ్లకు డౌట్ వస్తుంది. అదే సమయంలో కొంతమంది తీవ్రవాదులు ఈ ఆరుగురితో పాటు అతడిని కూడా కిడ్నాప్ చేస్తారు. అసలు ఫోన్ కాల్ రాగానే జనాలు ఎలా ఆచనిపోతున్నారు? వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారు? ఉగ్రవాదుల డిమాండ్ ఏంటి? ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ.. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై భారతదేశం పోరాడుతుంది. ఇలాంటి సమయంలో చైనా ఉగ్రవాదం అనే కాన్సెప్ట్ తో ఈ ‘6 జర్నీ’ సినిమా వచ్చింది. తీవ్రవాదం అంటే తుపాకీ పట్టి చేసేది మాత్రమే కాదు టెక్నాలజీతో కూడా చేస్తున్నారని ఈ సినిమాలో చూపించారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా తెరకెక్కించడంలో కాస్త తడబడ్డారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా మర్డర్ చేయడం ఏంటి అని ఆసక్తిగా ఉంటుంది. ఆ తరువాత ఆరుగురు పరిచయం, ట్రావెలింగ్ ఎపిసోడ్స్ అంతా చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. లవ్ స్టోరీస్, కామెడీ ఎపిసోడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. హత్యలు చేసింది లిఫ్ట్ అడిగిన వ్యక్తి అని అనుమానం వచ్చిన తర్వాత సినిమా కాస్త ఆసక్తిగా మారుతుంది. తీవ్రవాదాన్ని కొత్త పంథాలో చూపించారు. క్లైమాక్స్ లో దేవుడి రిలేటెడ్ గా రాసుకున్న సీన్స్ బాగానే ఉంటాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. హీరోగా పరిచయమైన రవి ప్రకాష్ రెడ్డి బాగానే నటించాడు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న టేస్టీ తేజ అక్కడక్కడా నవ్వించాడు. ఇద్దరు హీరోయిన్స్ నటనలో పర్వాలేదనిపించినా గ్లామర్ బాగానే చూపించారు. మిగిలిన నటీనటులు అంతా కొత్తవాళ్లే. వారి పాత్రల్లో వారు పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. సాంగ్స్ యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ లో బాగానే ఉంటుంది. దేశభక్తి మీద రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కథలో పాయింట్ కొత్తగా ఉన్న స్క్రీన్ ప్లే రెగ్యులర్ గానే ఉంటుంది. గతంలో రెండు సినిమాలు తీసిన దర్శకుడు మూడో సినిమాని బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘6 జర్నీ’ సినిమా టెక్నాలజీ తీవ్రవాదం కాన్సెప్ట్ తో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.