Bigg Boss 7 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌డేనా..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో తొమ్మిదో వారం చివ‌రికి వ‌చ్చేసింది. ఎనిమిది వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు.

Tasty Teja likely to be eliminated

Bigg Boss 7 elimination : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో తొమ్మిదో వారం చివ‌రికి వ‌చ్చేసింది. ఎనిమిది వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్‌, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో న‌యని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ర‌తిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అనే విష‌యం పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొనింది.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి ‘మసాలా’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

తొమ్మిదో వారం నామినేషన్స్ లో అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, భోలే, తేజ, యావర్ ఉన్నారు. వీరిలో శోభాశెట్టి, టేస్టీ తేజాలు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు అన‌ధికార ఓటింగ్ ప్రకారం తెలుస్తోంది. గ‌త మూడు వారాలుగా శోభ శెట్టి కి ఓట్లు త‌క్కువ‌గా వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె సేవ్ అవుతూ వ‌స్తోంది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుంద‌ని కొంత మంది భావించారు. అయితే.. ఈ వారం టేస్టీ తేజా హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రీ ఈ వారం తేజానే ఎలిమినేట్ అయ్యాడా..? లేదంటే మ‌రొక‌రు ఎలిమినేట్ అయ్యారా..? అన్నది పూర్తి ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యాక చూడాల్సిందే.