Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి ‘మసాలా’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఇవాళ ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. ఇది గుంటూరు కారం సినిమా పాట అవునో కాదో తెలీదు కానీ చిత్రయూనిట్ మాత్రం ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది.

Mahesh Babu Guntur Kaaram Movie First Song Promo Release Announcement
Guntur Kaaram : మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ మూడో సారి జత కడుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడి ఇటీవలే శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదని అభిమానులు నిరాశలో ఉన్నారు.
మహేష్ బాబు పుట్టిన రోజుకి కూడా కేవలం పోస్టర్ తో సరిపెట్టేశారు. గుంటూరు కారం సినిమాని సంక్రాతి జనవరి 12న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసి తీరుతామని నిర్మాత నాగవంశీ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ ఎక్కడికెళ్లినా గుంటూరు కారం సినిమా గురించి, ఫస్ట్ సాంగ్ అప్డేట్స్ గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ చేస్తామని నాగవంశీ చెప్పారు. కానీ దసరా అయిపోయి దీపావళి కూడా వస్తుండటంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు..
అయితే ఇవాళ ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. ఇది గుంటూరు కారం సినిమా పాట అవునో కాదో తెలీదు కానీ చిత్రయూనిట్ మాత్రం ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది. దమ్ మసాలా.. అని సాగే పాటని రేపు నవంబర్ 5న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ అధికారికంగా రిలీజ్ అయ్యే పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీలే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
WAIT IS OVER!! ??
Get ready to witness The Highly Inflammable Superstar ‘s #GunturKaaram MASS in the first single #DumMasala ?
Promo out TOMORROW 11:07 AM!
A @MusicThaman Musical ??@urstrulyMahesh #Trivikram @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli… pic.twitter.com/jpEwUxtLyz
— Haarika & Hassine Creations (@haarikahassine) November 4, 2023