‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సినీ నటుడు కార్తికేయ. ప్రస్తుతం కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హిప్పీ. టిఎన్ కృష్ణ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్ ఆవిష్కరణ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘కార్తికేయతో కలిసి ‘గ్యాంగ్ లీడర్’లో పనిచేస్తున్నాను. ఆర్‌ఎక్స్ 100 గురించి ఇంతకు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.
Read Also : చాయ్‌వాలా టూ పీఎం: ట్రైలర్ చూశారా?
ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తుంటే… ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థమైంది. కార్తికేయతో పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఈ పరిచయంతోనే నేను హిప్పీ టీజర్ విడుదల చేశాను. సక్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ లక్షణాలు, వైబ్రేషన్స్ ఇందులో ఉన్నాయి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సమ్మర్‌లో తప్పకుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
కార్తికేయ మాట్లాడుతూ ‘నాని సార్‌తో పనిచేసే చాన్స్ నాకు ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో వచ్చింది. ఆ అడ్వాంటేజ్ తో టీజర్ లాంచ్ ఆయన చేతుల మీదుగా జరిపించాలని అనుకున్నా. నేను అడగ్గానే అంగీకరించారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఆయన బాగా క్లోజ్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియదు అని అనుకుంటున్న తరుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయనతో ఈ జర్నీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Read Also : నయనతార ‘ఐరా’ మూవీ ట్రైలర్ విడుదల
తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాటను పబ్బులో చిత్రీకరిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ షూటింగ్ ఉంటుంది. అందరి అంచనాలకు తగ్గరీతిలో నిర్మిస్తున్నాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.
{“preview_thumbnail”:”/sites/default/files/styles/video_embed_wysiwyg_preview/public/video_thumbnails/84rfJOLsV4w.jpg?itok=02u_jlYQ”,”video_url”:”https://youtu.be/84rfJOLsV4w”,”settings”:{“responsive”:1,”width”:”854″,”height”:”480″,”autoplay”:0},”settings_summary”:[“Embedded Video (Responsive).”]}