ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి.. క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ప్రోమో : రామ్ గోపాల్ వర్మ

  • Publish Date - August 26, 2019 / 04:58 AM IST

నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంట్రవర్శీలే ఆయన కేరాఫ్. ఏ విషయం ట్రెండింగ్ లో ఉంటే ఆ విషయంపై ఓ కాంట్రవర్శీ కామెంట్ చేసి గిల్లి వదిలిపెడుతాడు. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు అందరూ చూశారు.

దేవుళ్ళనే వదిలిపెట్టని వర్మ సినిమా హీరోలు  ట్రెండింగ్ లో ఉంటే వదిలిపెడుతాడా? చిన్నాపెద్దా లేకుండా అందరిపై విమర్శలు చేస్తుండే వర్మ.. సాహో స్టార్ ప్రభాస్ గురించి కూడా తనదైన శైలిలో కామెంట్లు చేసేశారు. ఈసారి ఓ అడుగు ముందుకేసి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ.. అందుకే నా క్యాస్ట్ అయిన ప్రభాస్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటించేసుకున్నారు.

“నాకు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ.. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురుచూస్తున్నా.. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి.. ఈ సంధర్భంగా నా నెక్స్ట్ సినిమా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమాలోని ఓ పాటని ఆగస్ట్ 27వ తారీఖు 9గంటల 27నిమిషాలకు బ్రహ్మ ముహుర్తంలో విడుదల చేయబోతున్నాను” అంటూ వెల్లడించారు.

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పై కూడా రామ్ గోపాల్ వర్మ చాలా కామెంట్లే చేశాడు. మధ్యలో మహేష్ బాబుపై ఇప్పడు ప్రభాస్ గురించి కామెంట్లు చేస్తున్నాడు వర్మ.