Ted Sarandos Special Post on Meetings with Tollywood Stars
Ted Sarandos : నెట్ ఫ్లిక్స్(Netflix) CEO టెడ్ సరండోస్(Ted Sarandos) ఇండియాకు రాగా టాలీవుడ్ లో వరుస పెట్టి స్టార్స్ అందర్నీ కలుస్తూ ఆశ్చర్యపరిచారు. చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివ, అల్లు అర్జున్, సుకుమార్, మహేష్ బాబు, త్రివిక్రమ్, వెంకటేష్, ప్రభాస్, నాగ్ అశ్విన్, నాగ చైతన్య, రాజమౌళి, సురేష్ బాబు, రానా, దుల్కర్ సల్మాన్, శోభు యార్లగడ్డ, స్వప్న దత్, ప్రియాంక దత్, విక్కీ, మైత్రి నిర్మాతలు.. పలువురు మరికొంతమంది సినీ ప్రముఖులను ఆయన కలిశారు.
గత మూడు రోజులుగా టాలీవుడ్ మీటింగ్స్ తో టెడ్ సరండోస్ బిజీగా ఉన్నారు. స్టార్ సెలబ్రిటీలందరిని కలిసి వారితో ముచ్చటించారు. సినిమాల గురించి, నెట్ ఫ్లిక్స్ గురించి మాట్లాడారు. భవిష్యత్తులో నెట్ ఫ్లిక్స్ ప్రోగ్రామ్స్ గురించి, ఇక్కడ తెలుగులో మార్కెట్ గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. టెడ్ సరండోస్ తో మన స్టార్స్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Nayanthara : సూపర్ స్టార్ బిరుదుపై వివాదం.. స్పందించిన నయనతార..
టాలీవుడ్ తో మీటింగ్స్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ మన స్టార్స్ తో దిగిన పలు ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. గత మూడు రోజులుగా తెలుగు సినిమా లెజెండరీలను నేను కలిశాను. వాళ్ళ స్టోరీలు, సినిమాపై వారికి ఉన్న డెడికేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. లైఫ్ టైం అనుభవం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్. మరోసారి రావడానికి నేను ఎదురు చూస్తున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో వరల్డ్ టాప్ ఓటీటీ సీఈఓ టెడ్ సరండోస్ ఇలా మన స్టార్స్ గురించి పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.