Teja Sajja : ‘మిరాయ్’ సినిమా కోసం తేజ సజ్జ సాహసం.. డూప్ లేకుండా ట్రైన్ యాక్షన్స్ చేసి చేతికి గాయంతో..

ఇటీవలే తేజ సజ్జ మిరాయ్ షూటింగ్ శ్రీలంకలో పూర్తిచేసుకొని వచ్చాడు.

Teja Sajja Injured while Mirai Movie Action Shoot in Sri Lanka

Teja Sajja : తేజ సజ్జ ఇటీవల హనుమాన్ సినిమాతో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. హనుమాన్ తరువాత మిరాయ్ లాంటి భారీ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే మిరాయ్ సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇటీవలే తేజ సజ్జ మిరాయ్ షూటింగ్ శ్రీలంకలో పూర్తిచేసుకొని వచ్చాడు. శ్రీలంకలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించినట్టు సమాచారం. అయితే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ లో తేజ సజ్జ డూప్ లేకుండా చేసాడట. ఇటీవల తేజ సజ్జ ట్రైన్ పై యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న చిన్న వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో తేజ సజ్జ చేతికి గాయం అయిందని సమాచారం.

Also Read : Ram Charan : చరణ్ క్రేజ్ హాలీవుడ్, జపాన్ దాటి కొరియా దాకా వెళ్ళిందిగా.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌కి K పాప్ సింగర్ డ్యాన్స్..

శ్రీలంకలో షూట్ ముగించుకొని నిన్నే తేజ సజ్జ హైదరాబాద్ కి తిరిగివచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో తేజ సజ్జ కనిపించగా అతని చేతికి కట్టు వేసి ఉంది. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. తేజ సజ్జ ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు అతను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక డూప్ లేకుండా రియల్ గా యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నందుకు అతన్ని అభినందిస్తున్నారు. హనుమాన్ లో కూడా తేజ సజ్జ డూప్ లేకుండా రియల్ యాక్షన్ సీన్స్ చేసి మెప్పించాడు. ఆ సినిమా వల్ల కూడా అతని కంటికి సమస్యలు వచ్చి చికిత్స చేయించుకున్నాడు. ఇలా సినిమాల కోసం తేజ సజ్జ బాగా కష్టపడుతున్నాడు.