×
Ad

Mirai Collections : తేజ స‌జ్జా ‘మిరాయ్‌’.. వారం రోజుల్లో అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌.. ఎంతో తెలుసా?

సెప్టెంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మిరాయ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల (Mirai Collections) సునామీ సృష్టిస్తోంది.

Teja Sajja Mirai 7 days Collections details here

Mirai Collections : టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జా న‌టించిన చిత్రం మిరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రితికా నాయక్ క‌థానాయిక‌. మంచు మ‌నోజ్ విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బ్లాక్ బాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ (Mirai Collections ) సృష్టిస్తోంది. విడుద‌లైన ఐదు రోజుల్లో 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక ఈ చిత్రం విడుద‌లై ఏడు రోజులు పూరైంది. వారం రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 112.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

Anshu Malika : అమెరికాలో రోజా కూతురు అన్షుకు అవార్డు.. పోస్ట్ వైరల్..

ఈ చిత్రం రానున్న రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈనెల 25 వ‌ర‌కు పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం కూడా మిరాయ్ కు క‌లిసి రానుంద‌ని అంటున్నారు.

శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాంలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించారు. అశోకుడు రాసిన 9 గ్రంధాల చుట్టే ఈ చిత్ర క‌థ సాగుతుంది. దీనికి ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ను మేళవించి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో శ్రీరాముడి ఎలిమెంట్ ను ఇంప్లిమెంట్ చేసిన విధానం, దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.