Teja Sajja prasanth varma HanuMan movie graphics is designed by Uday Krishna
HanuMan : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ సూపర్ హీరోగా నటించిన మూవీ ‘హనుమాన్’. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరిని అబ్బురపరిచాయి. ముఖ్యంగా హనుమాన్ సన్నివేశాల షాట్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించాయి. ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలో కూడా కనిపించని క్వాలిటీ.. ఈ సినిమా గ్రాఫిక్స్ లో కనిపించడంతో ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విజువల్ ఎఫెక్ట్స్ మాంత్రికుడు ఎవరో తెలుసా..?
విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో దాదాపు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉండి, దీనిలో గ్రాఫిక్స్ మాంత్రికుడిగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి ‘ఉదయ్ కృష్ణ’. ఇక ఈ సినిమాకి గ్రాఫిక్స్ చేసే అవకాశం రావడం పట్ల ఉదయ్ కృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఈ అవకాశం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకి ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.
Also read : HanuMan : సీక్వెల్‌లో స్టార్ హీరో కోసమే.. మూవీలో ‘హనుమాన్’ ఫేస్ చూపించలేదు..
ఇక టాలీవుడ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో రాజమౌళికి మంచి పేరు ఉందని, ప్రశాంత్ వర్మ కూడా రాజమౌళి అంతటి సమర్థవంతుడని ప్రశంసల వర్షం కురిపించారు. గత రెండేళ్లుగా హనుమాన్ చిత్రం తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిందని పేర్కొన్న ఉదయ్ కృష్ణ.. ఇప్పుడు ఆ చిత్రం సాధిస్తున్న విజయం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని చెప్పుకొచ్చారు.
హనుమాన్ సినిమాతో గ్రాఫిక్స్ రంగంలో తన పేరుని గట్టిగా వినిపించేలా చేసిన ఉదయ్ కృష్ణ.. ఇప్పుడు “బీస్ట్ బెల్స్” పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్ లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. ఇక మన తెలుగు దర్శకులు అందరికి ఆయన ఒక మాట గట్టిగా విన్నవించుకున్నారు. మన దర్శకులు కలలు గనే ఎంత గొప్ప విజువల్ అయినా.. సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా తెలియజేశారు.