HanuMan : రామ మందిరం ప్రారంభోత్సవం నాడు.. హనుమాన్ మూవీ సంచలనం..

ఒక పక్క దేశంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేడుకలతో రామనామ జపం జరుగుతుంది. మరో పక్క హనుమాన్ మూవీ సంచలనం..

Teja Sajja Prashanth Varma HanuMan rampage at world wide box office

HanuMan : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ.. 100 కోట్ల గ్రాస్ ని అందుకొని అదుర్స్ అనిపించింది. ఇక మొదటి వారం పూర్తి అయ్యేపాటికీ 150 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసేసింది.

ఇక తాజాగా ఈ సినిమా మరో సంచనలం నమోదు చేసింది. ఒక పక్క దేశంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేడుకలతో రామనామ జపం జరుగుతుంది. ఈ సందర్భంలో హనుమాన్ మూవీ 200 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసేసింది. మూవీ టీం ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 150 నుంచి 200 కోట్ల మార్క్ ని అందుకోవడానికి కేవలం మూడు రోజులు సమయం మాత్రమే పట్టడం గమనార్హం.

Also read : Ram Charan : అయోధ్యలో రామ్ చరణ్ క్రేజ్.. ఇది కదా కావాల్సింది.. చరణ్ తండ్రి ఆయన..

కేవలం ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తుంది. అమెరికాలో 1M డాలర్స్ కలెక్షన్స్ అందుకోవడమే ఒక రికార్డు. కానీ హనుమాన్ టీం 1M మార్క్ నుంచి 4M డాలర్స్ వరకు వెళ్ళింది. ఈక్రమంలో ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురంలో’, రామ్ చరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, ప్రభాస్ ‘సాహో’, ‘ఆదిపురుష్’ సినిమాలు 3 మిలియన డాలర్స్ పై కలెక్షన్స్ ని నమోదు చేశాయి.

హనుమాన్ 4M డాలర్స్ అందుకొని వాటి రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం హనుమాన్ అక్కడ టాప్ 5లో నిలిచింది. మొదటి నాలుగు స్థానాల్లో బాహుబలి 2 (20M), RRR (14.3M), సలార్ (8.9M), బాహుబలి 1 (8M) ఉన్నాయి. హనుమాన్ స్పీడ్ చూస్తుంటే బాహుబలి 1 రికార్డు వరకు వెళ్లేలా కనిపిస్తుంది. మరి హనుమాన్ రాంపేజ్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.