Teja Sajja: మూడు నెలల గ్యాప్.. మరో ఇంటర్నేషనల్ మూవీతో తేజ సజ్జా.. ఇది కదా ప్లానింగ్ అంటే!

తేజ సజ్జా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది(Teja Sajja). మిరాయ్ సూపర్ సక్సెస్ తో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ కుర్ర హీరో.

Teja Sajja Zombie Reddy 2 movie to start from January 2026

Teja Sajja: తేజ సజ్జా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. మిరాయ్ సూపర్ సక్సెస్ తో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే హనుమాన్ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్న తేజ.. మిరాయ్ తో దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. తన అద్భుతమైన నటనతో మిరాయ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే, తేజ సజ్జా చేయబోతున్న తరువాతి సినిమా గురించి ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలోనే తేజ సజ్జా(Teja Sajja) నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bellamkonda Srinivas: ఒక సినిమా సక్సెస్ తో రెండు సినిమాలకు ఫుల్ డిమాండ్.. బెల్లంకొండ శ్రీనివాస్ టైం స్టార్ట్స్!

అదేంటంటే, మిరాయ్ సినిమా కోసం గత మూడేళ్ళుగా కష్టపడుతున్న ఈ యంగ్ హీరో కేవలం మూడు నెలల బగ్యాప్ లో తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఆ సినిమా మరేదో కాదు జాంబీ రెడ్డి 2. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జనవరి నుంచి మొదలుకాబోతుందట. 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాకు ఇది సీక్వెల్. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా రీజనల్ మూవీగా తెరకెక్కి భారీ విజయాన్ని సాధించింది. కానీ, జాంబీ రెడ్డి 2 మాత్రం ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కబోతుందట. ఈ విషయాన్నీ ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

మిరాయ్ సినిమాకు కూడా టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెంటనే మళ్ళీ తేజ సజ్జాతో జాంబీ రెడ్డి 2 చేస్తున్నాడు ఈ నిర్మాత. ఇక జాంబీ రెడ్డి 2 విషయానికి వస్తే.. భారీ గ్రాఫిక్స్ తో, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ కేటాయించారట. ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి, జాంబీ రెడ్డి 2 సినిమా తరువాత తేజ సజ్జా రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం ఖాయం. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా తేజ సజ్జాకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.