Bellamkonda Srinivas: ఒక సినిమా సక్సెస్ తో రెండు సినిమాలకు ఫుల్ డిమాండ్.. బెల్లంకొండ శ్రీనివాస్ టైం స్టార్ట్స్!
కంటెంట్ తో వస్తే ఆ సినిమాను ఎవరు ఆపలేరు అని కాష్కిందపురి సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరెకక్కించాడు.

Bellamkonda Srinivas Haindava and Tyson Naidu's films are getting ready for release
Bellamkonda Srinivas: కంటెంట్ తో వస్తే ఆ సినిమాను ఎవరు ఆపలేరు అని కాష్కిందపురి సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరెకక్కించాడు. హారర్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఓపక్క మిరాయ్ సినిమా పోటీ ఉన్నప్పటికీ స్టాండర్డ్ కలెక్షన్స్ తో ఈ సినిమా రన్ అవుతూ మంచి వసూళ్ళని రాబడుతోంది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత విజయాన్ని అందుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కిష్కిందపురి విజయం ఆయన కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ముందు నుంచే ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas). ఆ నమ్మకమే ఇప్పుడు నిజమయ్యింది.
Nani: ఫైనల్ గా నాని కూడా ఆ రూట్ లోకి వచ్చేశాడట.. కేవలం డైరెక్టర్ పై ఉన్న నమ్మకం వల్లే!
ఈ సినిమా అందించిన సక్సెస్ తన రాబోయే సినిమాలకు మంచి డిమాండ్ ను తెచ్చిపెట్టింది. కిష్కిందపురి తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒకటి టైసన్ నాయుడు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి, నిన్నమొన్నటివరకు ఈ సినిమా ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు. కిష్కిందపురి విజయంతో టైసన్ నాయుడుపై మంచి బిజినెస్ జరుగుతోంది.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి రాబోతున్న మరో సినిమా హైందవ. డివోషనల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను లుదీరి బైరెడ్డి తెరకెక్కిస్తున్నాడు. హిందుత్వంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న దశావతార టెంపుల్ కథతో ఈ సినిమా రానుంది. సరికొత్త కథనంతో విజువల్ వండర్ గా రానున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది. ఇప్పుడు కిష్కిందపురి సక్సెస్ తో హైందవ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఏదైతేనేం.. ఓక సినిమా అందించిన విజయం వల్ల రెండు సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మరి ఈ రెండు సినిమాలు ఆ విజయాన్ని కంటిన్యూ చేస్తాయా అనేది చూడాలి.