Nani: ఫైనల్ గా నాని కూడా ఆ రూట్ లోకి వచ్చేశాడట.. కేవలం డైరెక్టర్ పై ఉన్న నమ్మకం వల్లే!

నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది నానినే(Nani). ఆయన సినిమా ఏది కూడా ఆడియన్స్ ని పూర్తి గా డిజప్పాయింట్ చేయదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Nani: ఫైనల్ గా నాని కూడా ఆ రూట్ లోకి వచ్చేశాడట.. కేవలం డైరెక్టర్ పై ఉన్న నమ్మకం వల్లే!

Nani is doing a period film with director Shauryuv.

Updated On : September 19, 2025 / 2:41 PM IST

Nani: నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది నానినే. ఆయన సినిమా ఏది కూడా ఆడియన్స్ ని పూర్తి గా డిజప్పాయింట్ చేయదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మినిమమ్ గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ గా మారిపోయాడు నాని. అందుకే నాని సినిమా వస్తుంది అంటే ఎలాంటి అనుమానాలు లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అంతలా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు నాని(Nani). అయితే, నాని విషయంలో ఆడియన్స్ కి గానీ, అయన ఫ్యాన్స్ కి గానీ ఉన్న చిన్న వెలితి ఏంటంటే? పీరియాడిక్ సినిమా.

Prabhas-Abhishek: ప్రభాస్ మూవీలో అభిషేక్.. క్రేజీ ప్రాజెక్టులో కీ రోల్.. ఇంతకీ ఏ సినిమా కోసమో తెలుసా?

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పీరియాడిక్ సినిమాల వాహా నడుస్తోంది. ప్రతీ హీరో అలాంటి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగులో కుర్ర హీరోలు సైతం అలాంటి సినిమాలు చేస్తున్నారు. అయితే, నాని మాత్రం ఇప్పటివరకు ఆ జానర్ లో సినిమా చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం తమ హీరో కూడా అలాంటి ఒక సినిమా చేస్తే బాగుటుంది అని అనుకుంటున్నారట. ఫైనల్ గా వాళ్ళ కోరిక నెరవేరబోతోంది అని తెలుస్తోంది. అవును, నాని త్వరలోనే పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట.

ఈ సినిమా చేయబోతున్న ఆ దర్శకుడు మరెవరో కాదు. నానితో గతంలో హాయ్ నాన్న సినిమాను తెరకెక్కించిన శౌర్యువ్. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కానీ, అనుకున్న రిజల్ట్ రాలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శౌర్యువ్ వర్కింగ్ స్టైల్ నానికి నచ్చిందట. మరో మంచి కథ సిద్ధం చేసుకొని వస్తే సినిమా చేద్దాం అని చెప్పాడట. ఆమాటను సీరియస్ గా తీసుకున్న శౌర్యువ్ ఇటీవల నానిని కలిసి పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో అదిరిపోయే కథను వినిపించాడట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట నాని. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇక నాని విషయానికి వస్తే, ప్రతుతం దసరా దర్శకుడు పశ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఓజీ దర్శకుడితో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత శౌర్యువ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.