Tejeswini Nandamuri
Tejeswini Nandamuri : నందమూరి ఫ్యామిలీ అంతా ఏదో ఒక రకంగా సినీ పరిశ్రమకు అనుసంధానమైన వాళ్ళే. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా సినీ పరిశ్రమలోనే ఉంది. ఇన్నాళ్లు అన్ స్టాపబుల్ షోకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసింది. తన తమ్ముడు మోక్షజ్ఞ ని హీరోగా పెట్టి నిర్మాతగా సినిమా కూడా చేస్తుంది. ఇన్నాళ్లు ఇలా తెర వెనుక ఉన్న బాలయ్య రెండో కూతురు తేజస్విని ఇప్పుడు మొదటిసారి తెరపై కి వచ్చింది.(Tejeswini Nandamuri)
సిద్దార్థ ఫైన్ జ్యువెల్లర్స్ అనే కంపెనీకి జ్యువెల్లరీ యాడ్ లో నటించింది. ఒక నిమిషం పైనే ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ యాడ్ లో తేజస్విని ఆభరణాలు ధరించి రాక్ క్లైంబింగ్ చేసింది, డ్యాన్స్ చేసింది. మొదటిసారి అయినా చాలా బాగా నటించింది తేజస్విని. దీంతో బాలయ్య ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఈ యాడ్ ని వైరల్ చేస్తూ ఎంతైనా నటన వాళ్ళ ఇంట్లో, రక్తంలోనే ఉంటుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
Also See : Ananya Panday : లైగర్ భామ.. అనన్య పాండే బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
మీరు కూడా నందమూరి తేజస్విని నటించిన యాడ్ చూసేయండి..
ఈ యాడ్ ని భారీగానే ఖర్చుపెట్టి తీశారు. ఈ యాడ్ కి అందరు టాప్ టెక్నీషియన్స్ పనిచేసారు. సీనియర్ యాడ్ ఫిలిం మేకర్ యమునా కిషోర్ ఈ యాడ్ ని డైరెక్ట్ చేయగా తమన్ మ్యూజిక్ అందించాడు. స్టార్ ఎడిటర్ నవీన్ నులి యాడ్ ని ఎడిట్ చేసారు. ఆయాంక బోస్ సినిమాటోగ్రఫీ చేయగా స్టార్ ఫోటోగ్రాఫర్ డాబూ రతాని స్టిల్స్ తీశారు. డ్యాన్స్ మాస్టర్ బృంద డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కూడా యాడ్ కి పనిచేసారు. ఇలా పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు ఈ యాడ్ కోసం పనిచేయడం గమనార్హం.
Also See : Anasuya Bharadwaj : చుట్టాల పెళ్లి వేడుకల్లో సందడి చేసిన అనసూయ.. క్యూట్ ఫొటోలు..