MAA : తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. డ్రగ్స్ రహిత సమాజం కోసం..

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సహకారంతో 'ఆపరేషన్ సంకల్ప్' అధికారికంగా ప్రారంభించారు.

Telangana Anti Narcotics Bureau Started with Operation Sankalp with Movie Artist Association

MAA : తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రచారాలు చేస్తూ అవగాహనా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ అడుగు ముందుకేసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పోరాడనుంది.

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సహకారంతో ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, మరియు సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించబడింది.

Also Read : NTR : బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో సినిమా.. షారుఖ్ – సల్మాన్ తో కలిసి.. ?

ఈ ముఖ్యమైన కార్యక్రమానికి TGANB డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి, TGANB ఎస్పీ శ్రీ పి.సీతారామ మరియు డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ డైరెక్టర్ శైలజ.. పలువురు హాజరయ్యారు.