NTR : బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో సినిమా.. షారుఖ్ – సల్మాన్ తో కలిసి.. ?

దేవర తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా వార్ 2 తో రాబోతున్నాడు ఎన్టీఆర్.

NTR : బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో సినిమా.. షారుఖ్ – సల్మాన్ తో కలిసి.. ?

Jr NTR will Appear another Bollywood Movie with Shah Rukh Khan and Salman Khan

Updated On : June 11, 2025 / 7:43 PM IST

NTR : ఎన్టీఆర్ RRR తర్వాత అన్ని భారీ పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. దేవర తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా వార్ 2 తో రాబోతున్నాడు. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో భాగంగా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఆగస్టు 14 ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఎన్టీఆర్ కి ఇదే స్పై యూనివర్స్ లో సోలో హీరోగా కూడా సినిమా ఉంటుంది అని గతంలో డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ అన్నారు. అది కాకుండా ఎన్టీఆర్ మరో బాలీవుడ్ సినిమాలో భాగం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. YRF యూనివర్స్ లో పఠాన్ వర్సెస్ టైగర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ – సల్మాన్ తో ఈ సినిమా ఉండనుంది. షారుఖ్ పఠాన్ – సల్మాన్ టైగర్ పాత్రలతో ఈ సినిమా తెరకెక్కించనున్నారు.

Also Read : Raha Kapoor : రెండేళ్లకే 250 కోట్ల ఆస్తి.. కూతురి పేరు మీద రాసేసిన రణబీర్ – అలియా..

అయితే ఈ సినిమాలో వేరే స్పై హీరోలు గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్, జాన్ అబ్రహంతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ పఠాన్ వర్సెస్ టైగర్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఎన్టీఆర్ షారుఖ్ – సల్మాన్ లతో కలిసి నటించబోతున్నాడు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. ఈ సినిమాని కూడా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తాడని సమాచారం.

మొత్తానికి ఎన్టీఆర్ మెల్లిమెలిగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడేమో అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2, త్రివిక్రమ్ తో మైథాలజీ సినిమా, స్పై యూనివర్స్ లో సోలో సినిమాలు ఉన్నాయి.

Also See : Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..