Telangana Police Department issues a GO to reduce OG movie ticket rates
OG Tickets Issue: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన “ఓజీ” సినిమా టికెట్ రేట్ల పెంపును వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ సూచించింది. ఈమేరకు సోమవారం జీవోను జరీ చేసింది. నిబంధలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ మల్టీప్లెక్స్, సింగిల్ స్ర్కీన్స్ (OG Tickets Issue)యాజమాన్యాలను హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో టికెట్ రేట్స్ పెంపును హైకోర్టును సస్పెండ్ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలో పేర్కొంది పోలీస్ శాఖ.
ఇక పోలీస్ వారు ఇచ్చిన ఆదేశాలతో మంగళవారం నుంచి ఓజీ, మరియు ఇతర సినిమాల టికెట్స్ సాధారణ ధరలకు రానున్నాయి. ఇక ఓజీ సినిమాకు టికెట్ రేట్స్ పెంచడాన్ని సవాలు చేస్తూ మహేశ్ యాదవ్ హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ విచారణ అనంతరం దరల పెంపు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సెప్టెంబర్ 24న ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన సినిమా మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ నుంచి ఓజీ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో, కేవలం నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్ల కలెక్షన్స్ సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.