Sobhita Dhulipala: చైతన్యతో పెళ్లి తరువాత శోభిత మొదటి సినిమా.. ఈసారి యాక్షన్ మోడ్ లో.. టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది చూశారా?

శోభిత ధూళిపాళ.. ఈ అమ్మడు గతేడాది అక్కినేని నాగ చైతన్యతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే(Sobhita Dhulipala). సమంతతో విడాకుల అనంతరం చాలా కాలం ఈ జంట రిలేషన్ లో ఉన్నారు.

Sobhita Dhulipala: చైతన్యతో పెళ్లి తరువాత శోభిత మొదటి సినిమా.. ఈసారి యాక్షన్ మోడ్ లో.. టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది చూశారా?

Shobhita Dhulipala is doing her first film after marriage.

Updated On : September 30, 2025 / 6:45 AM IST

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ.. ఈ అమ్మడు గతేడాది అక్కినేని నాగ చైతన్యతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. సమంతతో విడాకుల అనంతరం చాలా కాలం ఈ జంట రిలేషన్ లో ఉన్నారు. ఆ తరువాత పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. పెళ్ళి తరువాత శోభిత ధూళిపాళ్ల సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ, నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పెళ్లి తరువాత మొదటి సినిమా చేసేందుకు సిద్ధం అవుతోంది(Sobhita Dhulipala) శోభిత.

Rishab Shetty: ఇంటర్వ్యూలు తమిళ్ లో.. తెలుగులో మాత్రం కన్నడ.. ఇదెక్కడి న్యాయం రిషబ్

అది కూడా తెలుగులో కాదు తమిళంలో. అవును, తమిళ దర్శకుడు పా. రంజిత్ ఇటీవల “వెట్టువమ్‌” అనే సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో ఆర్య, వీఆర్‌ దినేశ్‌ హీరోలుగా నటిస్తున్నారు. గతంలో ఆర్య, పా. రంజిత్ కాంబోలో సార్పట్టా అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించ్చింది. అందుకే ఈ కొత్త సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “వెట్టువమ్‌” నుంచి ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్, టేకింగ్, మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

అయితే, ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం శోభిత ధూళిపాళ ను తీసుకున్నారట మేకర్స్. చాలా పవర్ ఫుల్ అండ్ యాక్షన్ మోడ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట శోభిత. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. శోభిత ధూళిపాళ గతంలో కూడా చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. అదే పంథాలో ఇప్పుడు “వెట్టువమ్‌” సినిమా చేస్తున్నారు ఆమె. మరి పెళ్లి తరువాత చాలా గ్యాప్ తరువాత ఆమె చేస్తున్న ఈ సినిమా శోభితకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.