Telugu Latest Films: పసలేని సినిమాలతో పిచ్చెక్కిపోతున్న ప్రేక్షకులు!
ఈ వారం కాకపోతే వచ్చే వారం.. ఆ వారం కూడా అదే బాపతయితే ఆపై వచ్చే వారం కోసం ఎదురుచూడడం. ఇది ఇప్పుడు సగటు తెలుగు ప్రేక్షకుల పరిస్థితి. కరోనా తర్వాత వరసపెట్టి టాప్ హీరోల సినిమాలన్నీ..

Telugu Latest Films
Telugu Latest Films: ఈ వారం కాకపోతే వచ్చే వారం.. ఆ వారం కూడా అదే బాపతయితే ఆపై వచ్చే వారం కోసం ఎదురుచూడడం. ఇది ఇప్పుడు సగటు తెలుగు ప్రేక్షకుల పరిస్థితి. కరోనా తర్వాత వరసపెట్టి టాప్ హీరోల సినిమాలన్నీ క్యూ కడతాయనుకుంటే అందరూ కలిసి ఏ పండగకో పబ్బానికో ప్లాన్ చేసుకున్నారు. సీనియర్ హీరోలలో కరోనా తర్వాత వైల్డ్ డాగ్, నారప్ప సినిమాలు తప్ప ఇంకేం లేవు. మోస్తరు హీరోల పరిస్థితి మరీ ఘోరం. గోపీచంద్ ఏదో ఒకటీ ఆరా తెచ్చాడు కానీ ఇంక ఒక్కరు కదల్లేదు. నానీ టక్ చేసుకొని ఓటీటీలోకి వెళ్ళాడు.
Jr NTR: తారక్ రెండు నెలల విరామం వెనుక అసలు నిజమేంటి?
ఇక, యంగ్ హీరోలలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్, నాగ చైతన్య లవ్ స్టోరీ, నాగశౌర్య, శర్వానంద్ ఇలా తలాఒక చేయిసి ప్రేక్షకుల ఆకలి తీర్చాలనుకున్నారు. కానీ.. ఒకటీ అరా మినహా ఏదీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేదు. దీంతో సినిమా ప్రేక్షకులకు ఏ వారానికి ఆ వారం ఎదురుచూపులే మిగిలాయి. పెద్ద హీరోల సినిమాలన్నీ డిసెంబర్, సంక్రాంతికి ఫిక్స్ చేసుకోవడంతో అక్టోబర్, నవంబర్ నెలలలో చోటా మోటా హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి. మంచి రోజులు వచ్చాయి, పుష్పక విమానం, తెలంగాణ దేవుడు అంటూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
Keerthy Suresh: బ్యూటీ విత్ టాలెంట్ మహానటి!
అయితే, పెద్ద హీరోల సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడం మరో నెల రోజులు ఆ ఊసే లేకపోవడంతో సినీ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. కరోనా తర్వాత జనాలు మళ్ళీ స్వేచ్ఛగా తిరగడం మొదలై నెలలు గడుస్తున్నా దాన్ని క్యాష్ చేసుకోవడంలో సినిమా సక్సెస్ కావడం లేదు. థియేటర్లో మంచి సినిమా పడితే జనాలు అటు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ అలా రాబట్టే సినిమాలే రావడం లేదు. ఆ దిశగా ఇప్పట్లో ఆలోచనలు కూడా కనబడడం లేదు.
Aishwarya Rai: మరోసారి తల్లి కాబోతున్న ప్రపంచ సుందరి?
థియేటర్లోకి వెళ్లి నెగటివ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమా చూసే కన్నా ఇంట్లో కూర్చొని వాళ్ళకి నచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మళ్ళీ చేసేందుకే నయం అనిపించే స్థాయి నుండి ప్రేక్షకులను థియేటర్లకి లాక్కొచ్చే బొమ్మ పడడం లేదు. ఇది సినీ పరిశ్రమకి మంచిది కాదు. నలుగురు సీనియర్ హీరోలు.. అరడజను మంది మీడియం హీరోలు, డజను మంది యంగ్ హీరోలున్నా ఒక్కరూ ఇద్దరూ మినహా గత రెండు నెలల్లో వచ్చే నెలలో ఒక్కరు కూడా ఎంటర్ టైం చేసే బాధ్యతను తీసుకోవడం లేదు.
Prabhas: రెబల్ స్టార్ పాన్ వరల్డ్ సినిమా.. కొరియన్ భామతో రొమాన్స్!
అంతా క్రిస్టమస్, సంక్రాంతి, సమ్మర్ అంటూ మూకుమ్మడిగా పోటాపోటీగా ముహుర్తాలు పెట్టుకున్నారు తప్ప ప్రతి శుక్రవారం ఊరికే వచ్చి పోతుందే అనే ఆలోచన కనబడడం లేదు. కోటానుకోట్ల బడ్జెట్ల సినిమాలన్నీ రెండు నెలలలోనే వరస పెట్టగా ముందున్న ఈ రెండు నెలలు ఊరికే ఉసూరుమనిపిస్తున్నాయి. మరి ప్రేక్షకుల మోర మేకర్స్ ఆలకించి ఒకటి రెండు సినిమాలనైనా ఈ గ్యాప్ లో తెస్తారా లేదు మరో నెల రోజులు ఆగాల్సిందే అంటారో చూడాలి!