Megastar Chiranjeevi : మెగాస్టార్ కోసం సైకిల్ పై వచ్చి రాఖీ కట్టిన లేడి అభిమాని…
తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). తనను కలిసేందుకు..

Chiranjeevi heartwarming gesture towards fan rajeshwari
Megastar Chiranjeevi : తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణంలో రాజేశ్వరి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు చిరంజీవి (Megastar Chiranjeevi)అంటే ఎంతో ఇష్టం. ఆయనకు వీరాభిమాని. ఈ క్రమంలో చిరును కలవాలని భావించింది. అనుకున్నదే తడవుగా సైకిల్ పై ఆదోని నుంచి హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టింది.
మధ్యలో ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనప్పటికి కూడా ఆమె చిలించలేదు. చిరంజీవిపై ఉన్న అపారమైన అభిమానమే ఆమెను ముందుకు నడిపించాయి.
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. తనను కలుసుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి చలించిపోయారు. ఓ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించారు.
Vishal engagement : హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్‌మెంట్
ఇక రాజేశ్వరి మెగాస్టార్‌కు రాఖీ కట్టగా.. ఆమెకు ఆశీస్సులు అందించడంతో పాటు చీరను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదండోయ్.. రాజేశ్వరి పిల్లల విధ్య కోసం, వారి భవిష్యత్ కోసం ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.