Sirivennela Sitaramasastri : సాహిత్యానికి ఇది చీకటి రోజు – చిరు

తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో హృదయాల్ని కలచివేసింది.

Sirivennela Sitaramasastri : తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో హృదయాల్ని కలచివేసింది. ఆయన మనమధ్య లేరన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఆయన కలం నుంచి జారువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.

* సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాననిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. – దర్శకుడు కె. విశ్వనాథ్‌.

* సీతారామశాస్త్రిగారు ఆసుపత్రిలో చేరకముందు వారితో మాట్లాడా.. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అరా తీశా.. చెన్నైలో తేలిన హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పా. ప్రస్తుతానికి ఇక్కడ జాయిన్ అవుతా.. ఇక్కడ ఉపశమనం పొందకపోతే నువ్వు చెప్పిన దగ్గరికే వెళ్దాం అన్నారు. ఆలా ఆసుపత్రికి వెళ్లిన మనిషి ఇలా తిరిగొస్తారని ఉహించలేకపోయా – నటుడు చిరంజీవి.

* తెలుగు పాటను దశదిశలా వ్యాప్తి చేసిన ఘటన సిరివెన్నెలకే దక్కుతుంది. వారులేని లోటు తీర్థం ఎవరికి సాధ్యం కాదు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. – నటుడు నందమూరి బాలకృష్ణ.

* సిరి వెన్నెల సీతారామశాస్త్రి నా సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని మనసారా ప్రార్థిస్తున్నా. – నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌.

* ఇంకెక్కడి వెన్నెల.. తెలుగు పాటకు అమావాస్య. – దర్శకుడు హరీశ్‌ శంకర్‌.

* సిరివెన్నెలగారు ఇక లేరనే వార్త వినగానే షాక్‌కు గురయ్యా. తన సాహిత్యంతో తెలుగు సినిమాకు ఎంతో సేవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరకుంటున్నా. – నటుడు నితిన్‌.

* గురూజీ! అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోయావ్. నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికి మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు. – నటుడు బండ్ల గణేశ్‌.

 

 

ట్రెండింగ్ వార్తలు