David Warner : డేవిడ్ వార్న‌ర్‌కు తెలుగు నేర్పిస్తున్న నితిన్‌, శ్రీలీల‌.. నవ్వులే.. న‌వ్వులు.. వీడియో వైర‌ల్‌

వీడియోలో నితిన్‌, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ త‌మ‌ను పొగిడించుకున్నారు.

Telugu Classes for David Bhai

నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల క‌థానాయిక‌. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఈ మూవీతోనే తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో ఆదివారం (మార్చి23న‌) ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమా పై అంచ‌నాల‌ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ వీడియోను విడుద‌ల చేసింది.

ఈ వీడియోలో డేవిడ్ వార్న‌ర్‌కు హీరో నితిన్‌, హీరోయిన్ శ్రీలీల తెలుగు నేర్పిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్న‌ర్ ఎలా మాట్లాలి అన్న విష‌యాల‌ను చెప్పారు. కాగా.. ఈ వీడియోలో నితిన్‌, శ్రీలీల లు తెలుగు నేర్పిస్తున్నాం అంటూ త‌మ‌ను పొగిడించుకున్నారు. ఈ విష‌యాన్ని వార్న‌ర్ ప‌సిగ‌ట్ట‌డం విశేషం.

Mazaka : మన్మధుడు హీరోయిన్ రీ ఎంట్రీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎందులో? ఎప్పుడో తెలుసా?

జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల కిశోర్‌, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర టికెట్ రేట్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెంచుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. వారం రోజుల పాటు సింగిల్ స్ర్కీన్ల‌లో ఒక్కొ టికెట్ పై రూ.50, మ‌ల్టీప్లెక్స్‌లో ఒక్కొ టికెట్ పై రూ.75ను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు జీవో విడుద‌ల చేసింది.