Mazaka Movie: మన్మధుడు హీరోయిన్ రీ ఎంట్రీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎందులో? ఎప్పుడో తెలుసా?
Mazaka Movie : సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమా జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Sundeep Kishan Ritu Varma Ansu Ambani Mazaka Movie OTT Streaming Details
Mazaka Movie :సందీప్ కిషన్, రీతువర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘మజాకా’. హాస్య మూవీస్, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రసన్న కుమార్ బెజవాడ కథ, కథనంలో మజాకా సినిమా తెరకెక్కింది. రావు రమేష్, అన్షు అంబానీ, మురళి శర్మ, హైపర్ ఆది.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల ఫిబ్రవరి 26 శివరాత్రి కానుకగా మజాకా సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా సినిమా థియేటర్స్ లో నవ్వించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
Also Read : Pawan Kalyan : OG లాస్ట్ సినిమా కాదు.. సినిమాలు చేస్తా అన్న పవన్.. ఎందుకంటే.. ఫ్యాన్స్ కి పండగే..
సందీప్ కిషన్ ‘మజాకా’ (Mazaka Movie)సినిమా జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
ఉగాదికి రెండు రోజుల ముందు నుంచే జీ5 లో కామెడీ పంచడానికి రెడీ అయిపోతుంది మజాకా సినిమా. ఇప్పటికే మజాకా సినిమాకు ఓటీటీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.