Pawan Kalyan : OG లాస్ట్ సినిమా కాదు.. సినిమాలు చేస్తా అన్న పవన్.. ఎందుకంటే.. ఫ్యాన్స్ కి పండగే..

రాజకీయంగా పవన్ ఉన్న స్థాయికి ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నా సినిమాలు చెయ్యట్లేదు అనే బాధ ఉంది.

Pawan Kalyan : OG లాస్ట్ సినిమా కాదు.. సినిమాలు చేస్తా అన్న పవన్.. ఎందుకంటే.. ఫ్యాన్స్ కి పండగే..

Pawan Kalyan Wants to do Movies Interesting Comments by him Fans Happy

Updated On : March 25, 2025 / 12:32 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మరింత బిజీ ఉండటంతో చేతిలో ఒప్పుకున్న సినిమాలకు వారం రోజులు కూడా కంటిన్యుగా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. రాజకీయంగా పవన్ ఉన్న స్థాయికి ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నా సినిమాలు చెయ్యట్లేదు అనే బాధ ఉంది.

ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, OG సినిమాలు మాత్రమే వస్తాయి, మిగిలిన రెండు సినిమాలు ఆగిపోయినట్టే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. హరిహర వీరమల్లు ఇప్పటికే పలుమార్లు వాయిదా పది మే 9న రిలీజ్ చేస్తామన్నారు. పవన్ ఒక్క వారం కేటాయిస్తే చాలు సినిమా పూర్తవుతుంది. ఇక OG పై భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాకు మాత్రం 20 రోజులు డేట్స్ కేటాయించాలి, బాడీ మెయింటైన్ చేయాలి. దీంతో పవన్ ఈ రెండిటికి డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Also Read : Amy Jackson : మరోసారి తల్లి అయిన హీరోయిన్.. ఫోటోలు షేర్ చేసి.. ఏకంగా ఆ అవార్డు పేరుని బాబుకి పేరు పెట్టేసారుగా..

ఇక OG తర్వాత పవన్ సినిమాలు మానేస్తారు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు. పవన్ ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ సినిమాలు చేస్తాను అని ప్రకటించాడు.

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. నాకు వ్యాపారాలు లేవు. సినిమాల్లో నిర్మాతను కూడా కాదు. నాకు ఉన్నది నటన ద్వారా ఆదాయ మార్గం ఒక్కటే. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను. నేను ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చేస్తాను. కానీ ప్రస్తుతం పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తాను అని అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Shihan Hussaini : పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూత.. ఇంతలోనే ఇలాంటి వార్త వినడం బాధాకరం అంటూ ఎమోషనల్ పోస్ట్..

పవన్ సినిమాలు చేస్తా అంటే దర్శకులు, నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. పవన్ చెప్పిన దాన్నిబట్టి చూస్తే హరిహర వీరమల్లు, OG తర్వాత కూడా సినిమాలు చేస్తాడు కాకపోతే డేట్స్ కుదరాలి అని అర్ధమవుతుంది. మరి పవన్ మున్ముందు రాజకీయాల్లో ఉంటూనే ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.