Gaddar Awards – Tollywood : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.. గద్దర్ అవార్డ్స్ గురించి త్వరలో..

తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ తో పాటు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది.

Telugu Film Chamber and Telugu Film Producers Council Reacts on CM Revanth Reddy Comments about Gaddar Awards

CM Revanth Reddy – Gaddar Awards : ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై గతంలో పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వాలతో కూడా మాట్లాడినా అది జరగలేదు. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది ఎలా ఇవ్వాలి అని దాని గురించి విధివిధానాలను తయారుచేయమని తెలుగు సినీ పరిశ్రమను ముఖ్య‌మంత్రి కోరారు.

అయితే దీనిపై టాలీవుడ్ స్పందించలేదని తాజాగా ఓ ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.

Also Read : Raj Tarun : నెల రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ చేస్తాను.. రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సంవత్సరంలో నాలుగు సినిమాలు..

తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ తో పాటు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో.. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ధన్యవాధాలు. కొద్దీ రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమకు సంబందించిన పలువురిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడారు. ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించి దానికి విధివిధానాలు తయారు చేయాలని కోరారు. ఈ విషయంలో ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి కలిసి గద్దర్ అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి తెలియచేశాం. త్వరలోనే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి గద్దర్ అవార్డు విధి విధానాలు ముఖ్యమంత్రికి, సినిమాటోగ్రఫీ మంత్రికి ఇస్తాము. నటుడిగా, కళాకారులుగా, జానపద పాటలతో, పేదలకు చేసిన సేవలకు గద్దర్ పై మాకు అభిమానం ఉంది అని తెలిపారు.

అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి గారిని కలిసి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అంశాల గురించి గతంలో మాట్లాడాము. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డులను ముఖ్యమంత్రి గద్దర్ అవార్డ్స్ పేరిట ఇస్తామని ప్రకటించాక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సంతోషం వ్యక్తపరిచారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి ఆల్రెడీ చర్చించాం. త్వరలోనే దీనికోసం ఒక కమిటీ వేసి విధివిధానాలను రూపొందించి తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తామని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు