Telugu Film Day : ‘తెలుగు సినిమా దినోత్సవం’ ఎప్పుడో తెలుసా? టాలీవుడ్ కీలక ప్రకటన.. అవార్డులు కూడా..

నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్ నటుడు మురళీమోహన్, పలువురు సినీ పెద్దలు.. సమావేశం అయి ఈ నిర్ణయాలను ప్రకటించారు.

Telugu Film Chamber Announced Telugu Film Day

Telugu Film Day : తెలుగు ప్రేక్షకులు సినిమాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రెగ్యులర్ గా సినిమాలకు వెళ్తారు. ఏ సినీ పరిశ్రమ వాళ్ళైనా తెలుగు సినిమాలను, తెలుగు ప్రేక్షకులను మెచ్చుకుంటారు. నేషనల్ సినిమా డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో జరుపుకుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ ప్రతినిధులు, తెలుగు ఫిలిం ఛాంబర్ కలిసి తెలుగు సినిమా దినోత్సవంను ప్రకటించాయి. అలాగే గతంలో సినిమా వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. ఆ అవార్డులు ఆగి చాలా కాలం అయింది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్తగా అవార్డులు ఇస్తామంటూ ప్రకటించారు.

నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్ నటుడు మురళీమోహన్, పలువురు సినీ పెద్దలు.. సమావేశం అయి ఈ నిర్ణయాలను ప్రకటించారు. ఈ సమావేశంలో ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించారు. మొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరి 6న రిలీజయింది. అందుకే ఫిబ్రవరి 6నే తెలుగు సినిమా దినోత్సవంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.

Also Read : Laila Trailer : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఓ వైపు లేడీ గెటప్.. మరో వైపు హీరోయిన్ తో లిప్ కిస్‌లు..

అలాగే.. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని, ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని ప్రకటించారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని, దానికి సంబంధించిన జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించారు.

Also Read : Pattudala : అజిత్ ‘పట్టుదల’ మూవీ రివ్యూ.. భార్య కోసం భర్త పోరాటం..

ఈ కార్యక్రమంలో మురళి మోహన్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ. రాజకీయ నాయకుడు పదవికాలం పూర్తయ్యాక ప్రజల్లో ఆదరణ ఉండదు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. సినీ నటులు మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. మద్రాసులో ఉన్నప్పుడు మేం సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తొలి తెలుగు టాకీ సినిమాకు సంబంధించి వివరాలను ఎంతో రీసెర్చ్ చేసి భక్త ప్రహ్లాద గురించి సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకం ఆవిష్కరించారు.