Laila Trailer : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఓ వైపు లేడీ గెటప్.. మరో వైపు హీరోయిన్ తో లిప్ కిస్‌లు..
మీరు కూడా లైలా ట్రైలర్ చూసేయండి..

Vishwak Sen Laila Movie Trailer Released
Laila Trailer : వరుసగా కమర్షియల్ సినిమాలతో విజయాలు దక్కించుకుంటున్నాడు యువ హీరో విశ్వక్ సేన్. మధ్యమధ్యలో ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. ఇటీవల మెకానిక్ రాకీ సినిమాతో వచ్చి పర్లేదు అనిపించిన విశ్వక్ ఇప్పుడు లైలా సినిమాతో రాబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Ananya Panday : పాపం.. దొరికిన ప్రతిసారి తండ్రీకూతుళ్ళు ఇద్దరూ విజయ్ ‘లైగర్’ సినిమాని ఏకేస్తున్నారుగా..
ఇప్పటికే లైలా సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా లైలా ట్రైలర్ చూసేయండి..
https://www.youtube.com/watch?v=FyhFBHpTh6Y
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. విశ్వక్ సోను మోడల్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సోను వల్ల ఏదో సమస్య అవ్వడంతో పోలీసులు ఇతన్ని వెతకడం మొదలుపెడతారు. దీంతో పోలీసులకు దొరక్కూడదు అని లేడీ గెటప్ వేసుకొని తిరుగుతాడు. మరి లేడీ గెటప్ వేసుకున్నాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, అసలు ఏ సమస్యలో ఇరుక్కున్నాడో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.
Also See : అల్లు అర్జున్ పుష్ప 2 జపనీస్ ఫైట్ చూశారా..? ఫుల్ ఫైట్ వీడియో రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్..
ఈ సినిమాలో ఓ పక్క లేడీ గెటప్ తో అలరిస్తూనే మరో పక్క హీరోయిన్ తో లిప్ కిస్ లు, రొమాన్స్ తో హడావిడి చేయనున్నాడు విశ్వక్. ఇక ఈ లైలా సినిమా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ కానుంది.