Ananya Panday : పాపం.. దొరికిన ప్రతిసారి తండ్రీకూతుళ్ళు ఇద్దరూ విజయ్ ‘లైగర్’ సినిమాని ఏకేస్తున్నారుగా..
2022లో ఈ సినిమా రిలీజయినా ఇప్పటికి కూడా అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండే ఈ సినిమా ఎఫెక్ట్ ని మర్చిపోలేకపోతున్నారు.

Ananya Panday Chunky Panday Comments on Vijay Deverakonda Liger Movie
Ananya Panday : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి వెళ్లి లైగర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ అని చోట్లా దారుణమైన పరాజయాన్ని చూసింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అనన్య తండ్రి చుంకీ పాండే ఓ కీలక పాత్ర పోషించాడు. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా నటించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ భారీ ఫ్లాప్ అయింది ఈ సినిమా.
అయితే 2022లో ఈ సినిమా రిలీజయినా ఇప్పటికి కూడా అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండే ఈ సినిమా ఎఫెక్ట్ ని మర్చిపోలేకపోతున్నారు. ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో రకంగా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. బాలీవుడ్ లో అనన్య, చుంకీ ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినా విజయ్ లైగర్ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. అనవసరంగా ఈ సినిమాని చేశామే అని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ ఇద్దరూ లైగర్ సినిమా చేసినందుకు బాధపడుతూ కామెంట్స్ చేసారు.
Also See : అల్లు అర్జున్ పుష్ప 2 జపనీస్ ఫైట్ చూశారా..? ఫుల్ ఫైట్ వీడియో రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్..
తాజాగా మరోసారి చుంకీ పాండే లైగర్ సినిమాపై వ్యాఖ్యలు చేసారు. చుంకీ పాండే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనన్యకు లైగర్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఒప్పుకోలేదు. ఆ పాత్ర తనకు ఎంతో అసౌకర్యంగా అనిపించింది. హీరోయిన్ పాత్రకు సెట్ అవ్వను, చిన్న పిల్లలా కనిపిస్తానని భావించింది. నా సలహా అడిగింది. కానీ పెద్ద ప్రాజెక్టు, కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్టు వెనక ఉన్నాడు దీంతో సక్సెస్ అయితే మంచి పేరు వస్తుందని చెయ్యమని చెప్పాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తను చెప్పింది నిజమే అనిపించింది. ఆ సినిమా తర్వాత తన సినిమాల విషయంలో నేను సలహాలు ఇవ్వట్లేదు అని అన్నారు.
Also Read : Pattudala : అజిత్ ‘పట్టుదల’ మూవీ రివ్యూ.. భార్య కోసం భర్త పోరాటం..
గతంలో అనన్య కూడా.. కరణ్ జోహార్, మా పేరెంట్స్ చెప్పడం వల్లే ఈ సినిమా చేసాను. మా అమ్మకు కూడా ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా రిజల్ట్ చూసి మా నాన్నని ఇంకోసారి సలహాలు ఇవ్వొద్దని చెప్పాను అంటూ కామెంట్స్ చేసింది. ఇలా కుదిరిన ప్రతిసారి అనన్య, చుంకీ తండ్రి కూతుళ్లు ఇద్దరూ లైగర్ సినిమాపై నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ సినిమా తీసిన విజయ్, పూరి కూడా మర్చిపోయినా వీళ్ళు మాత్రం ఇంకా దానిపై ఎందుకు నెగిటివిటి చూస్పిస్తున్నారో అర్ధం కావట్లేదు. విజయ్ ఫ్యాన్స్ ఈ విషయంలో అనన్యపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో అయినా అనన్య, చుంకీలు విజయ్ లైగర్ సినిమా ప్రస్తావన తీసుకురాకుండా ఉంటారేమో చూడాలి.