Site icon 10TV Telugu

Film Chamber : టాలీవుడ్ సమ్మె.. ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలు ఇవే.. ఇక నుంచి యూనియన్స్ తో సంబంధం లేకుండా..

Telugu Film Chamber of Commerce Decisions over Tollywood Strike

Film Chamber

Film Chamber : టాలీవుడ్ లో ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఏకంగా 30 శాతం వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ చేసిన ప్రతిపాదనలను ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో కార్మికులు షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఛాంబర్ – ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతలు అందరూ ఇప్పటికే చాలా ఎక్కువ చెల్లిస్తున్నామని ఫెడరేషన్ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. నేడు కూడా నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ఈ సమ్మె పై సమావేశం అయ్యారు.

నేడు ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, జరిగిన చర్చను ఛాంబర్ కార్యదర్శి, నిర్మాత దామోదర్ ప్రసాద్ మీడియాకు తెలియచేసారు. ఫిలిం ఛాంబర్ తెలిపిన అంశాలు..

Also Read : Movie Songs : పాట హిట్.. కానీ సినిమాలో ఉండదు.. ఇదే రీసెంట్ ట్రెండ్.. దేవర, గేమ్ ఛేంజర్, కింగ్డమ్, కుబేర.. అన్నిట్లోనూ అంతే..

1) తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇటువంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ కార్మిక శాఖ కమీషనర్ మార్గదర్శకత్వంలో సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ లేబర్ కమీషనర్ మాటను ధిక్కరిస్తూ నేటి నుంచి 30% వేతనాలు పెంచిన వారికి, ఇస్తామన్న నిర్మాతల షూటింగ్స్ కి మాత్రమే వెళ్లాలని నిర్ణయించడం చాలా బాధకరం.

2) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయటం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు, ఆ పెంపు వారు భరించే స్థాయిలో లేదు. ప్రతి చిన్న నిర్మాత ఈ పెంపుదలకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో భరించలేని ఈ పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించడమైనది. కనీస వేతనాల చట్టం ప్రకారం, కనీస వేతనాలు చెల్లించే ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. అదనంగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఫెడరేషన్ల ఒత్తిడి మరియు పోటీని నిరోధించే పద్ధతులను ఖండిస్తూ, అలాంటి నిబంధనలను అమలు చేయకుండా నిరోధించింది.

Also Read : Gowtam Tinnanuri : మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ‘కింగ్డమ్’ డైరెక్టర్.. సినిమా గురించి ఏమన్నారంటే..

3) కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో మిగతా మెట్రోపాలిటన్ పట్టణాలతో పోలిస్తే మన హైదరాబాద్లో తక్కువ. అయిన్పటికిని మనం అన్ని యూనియన్ల వారికి ఎక్కువ వేతనాలు చెల్లించడం జరగుచున్నది. ఇతర రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ఇచ్చే వేతనాల కంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పని చేసే కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నాము.

4) ఈ పరిస్థితుల నేపథ్యంలో, తెలుగు ఫిలిం చాంబర్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. దీని ప్రకారం నిర్మాతలు ఎవరైతే వైపుణ్యం కలిగిన వర్కర్స్ తాము ఇవ్వగలిగే వేతనానికి పనిచేస్తారో వాళ్ళు ఎవరైనా. వారు యూనియన్ లో ఉన్నా లేకున్నా వాళ్ళతో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది. ఔత్సాహిక నిపుణులు, కార్మికులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా యూనియన్లలో సభ్యత్వం కోసం లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ వారి ప్రవేశానికి సదరు యూనియన్లు అవరోధం కలిగిస్తున్నాయి. ఇది ఎంతో మంది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమే. ప్రతి ప్రాజెక్టు అవసరాలు మరియు వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్చ నిర్మాతలకు ఉంటుంది.

Also See : Coolie Pre Release Event : హైదరాబాద్ లో ‘కూలీ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు..

5) ఎవరైనా ఔత్సాహిక నిపుణులు, కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. లక్షలాది రూపాయలు సభ్యత్వం కొరకు కట్టవలసిన పని లేదు. నైపుణ్యం ఉన్న కార్మికునికి పని కల్పించడమే మా ధ్యేయం.

6) తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పరిశ్రమలోని అనేక రంగాలలో పని చేసి కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర స్టేక్ హోల్డర్పు ఉంటారు. వీరందరితో పని చేస్తూ ఒక సానుకూల నిర్ణయం వైపు మండలి పని చేస్తుంది.

7) నిర్మాత లేనిదే సినిమా పరిశ్రమ లేదు. మన ఫిలిం ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయం అని కార్మిక సంఘాలు మరొక్కసారి గుర్తించాలి అని తెలిపారు.

Exit mobile version