Movie Songs : పాట హిట్.. కానీ సినిమాలో ఉండదు.. ఇదే రీసెంట్ ట్రెండ్.. దేవర, గేమ్ ఛేంజర్, కింగ్డమ్, కుబేర.. అన్నిట్లోనూ అంతే..
తీరా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే ఆ పాట సినిమాలో ఉండట్లేదు.

Movie Songs
Movie Songs : ఇటీవల సినిమాలన్నీ ఓ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. సినిమా సాంగ్ అని ముందు ఒక పాట విడుదల చేస్తున్నారు. ఆ పాట సూపర్ హిట్ అవుతుంది. ఆ పాటకు అభిమానులు కూడా తయారవుతున్నారు. కానీ తీరా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే ఆ పాట సినిమాలో ఉండట్లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కేవలం ఆ పాట కోసమే వెళ్లిన ప్రేక్షకులు కూడా ఆ పాట లేదని నిరాశతో తిరిగొస్తున్నారు.
ఇలా ఇటీవల చాలా సినిమాల్లోనూ ఇదే జరుగుతుంది. కొంతమంది అయితే సినిమా రిలీజయ్యాక ఓ నాలుగైదు రోజులయ్యాక మళ్ళీ ఆ పాటను జత చేసి రిలీజ్ చేస్తున్నారు. అదేదో ముందే జత చేయొచ్చు కదా అని ప్రేక్షకులు అంటున్నారు.
Also Read : Gowtam Tinnanuri : మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ‘కింగ్డమ్’ డైరెక్టర్.. సినిమా గురించి ఏమన్నారంటే..
గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్, కియారా పై తెరకెక్కించిన నానా హైరానా సాంగ్ మెలోడీ హిట్ అయింది. దాంతో ఆ పాట పై అంచనాలు నెలకొన్నాయి. కానీ తీరా సినిమాకు వెళ్తే సినిమాలో ఆ పాట లేదు.
దేవరలో ఎన్టీఆర్, జాన్వీపై తెరకెక్కించిన మాస్ సాంగ్ దావుదీ కూడా ముందే రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. కానీ థియేటర్ కి వెళ్తే ఆ సాంగ్ లేదు.
ఇటీవల కుబేర సినిమాలో రష్మిక పిప్పి డుం డుం డుం సాంగ్ ని రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు. కానీ ఎడిటింగ్ లో ఆ సాంగ్ ని తీసేసారు.
లేటెస్ట్ గా కింగ్డమ్ సినిమాలో హృదయం లోపల అని విజయ్, భాగ్యశ్రీ లవ్ సాంగ్ ముందే రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయింది. కానీ సినిమాలో పాట సెట్ అవ్వట్లేదంటూ తీసేసారు. మళ్ళీ జత చేస్తామని కూడా చెప్పారు.
కొన్నాళ్ల క్రితం ఇండియన్ 2 సినిమాలో నీ పాద ధూళి మెరుపవుతాను అంటూ మెలోడీ, యాక్షన్ సాంగ్ బాగా వైరల్ అయింది. థియేటర్ కి కొంతమంది ఆ పాట కోసమే వెళ్తే అసలు ఆ పాటే లేదు సినిమాలో.
Also See Coolie Pre Release Event : హైదరాబాద్ లో ‘కూలీ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు..
అంతకు ముందు సర్కారు వారి పాట సినిమాలో మురారివా, పెన్నీ సాంగ్స్ సినిమాలో పెట్టలేదు. విరూపాక్షలో కళ్ళలో.. అంటూ సాగిన సాంగ్ కూడా తీసేసారు. ఇలా గతంలో కూడా కొన్ని సినిమాల్లో చేసారు. వీటిల్లో రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు ఆ పాటను సినిమాలో జత చేస్తే కొందరు మాత్రం అలాగే వదిలేస్తున్నారు.
దీనిపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమాలో పెట్టనప్పుడు ఆ సాంగ్ షూట్ చేయడం ఎందుకు, నిర్మాతకు డబ్బులు ఖర్చు ఎందుకు? పోనీ కట్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులకు జత చేయడం ఎందుకు, ఇదంతా మార్కెటింగ్ స్ట్రేటజీనా అని.. ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పాటతో సినిమాకు హైప్ తెచ్చి ఆ పాట సినిమాలో లేకుండా చేయడం ఇప్పుడు ట్రెండ్.