New FASTag Category : కేంద్రం సంచలనం.. కొత్త ఫాస్టాగ్ క్యాటగిరీ… వాళ్లు టోల్ కట్టాల్సిన పనిలేదు.. ఎన్నిసార్లైనా..
New FASTag Category : ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని వాహనాల కోసం ఒక స్పెషల్ ఫాస్టాగ్‌ను ప్రవేశపెడుతోంది. మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఎన్నిసార్లు అయినా టోల్ దాటవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
New FASTag Category ( Image Credit : ChatGPT AI )
- సరికొత్త టెక్నాలజీతో స్పెషల్ ఫాస్టాగ్ ప్రవేశపెట్టనున్న కేంద్రం
- ఈ ఫాస్టాగ్ సాధారణ ఫాస్టాగ్ మాదిరిగానే పనిచేస్తుంది
- టోల్ వసూలు చేయదు. ఏఐ టోల్ సిస్టమ్ వెహికల్ వెంటనే గుర్తిస్తుంది
- IHMCL పోర్టల్ ద్వారా మాత్రమే ఈ ఫాస్టాగ్ కోసం అప్లయ్ చేసుకోవాలి
New FASTag Category : వాహనదారులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో కొత్త టెక్నాలజీతో స్పెషల్ ఫాస్టాగ్ రాబోతుంది. హైవేలలో టోల్ ప్లాజాల వద్ద సూపర్ ఫాస్ట్ ప్రాసెస్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఏఐ-ఆధారిత టోల్ వ్యవస్థను అమలు చేస్తోంది.
ఈ సిస్టమ్ పాత టోల్ ప్లాజాలు, బారియర్ల స్థానంలో కెమెరాలు, సెన్సార్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీని ఏర్పాటు చేస్తుంది. ఇకపై వాహనాలు టోల్ చెల్లించేందుకు ఆగాల్సిన అవసరం ఉండదు. అందుకు బదులుగా ఈ సిస్టమ్ ఆ వాహనాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి టోల్‌ను నేరుగా కట్ చేస్తుంది. ఈ కొత్త సిస్టమ్ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ సిస్టమ్‌గా చెప్పవచ్చు.
‘స్పెషల్ ఫాస్టాగ్’పై కేంద్రం పరిశీలిన :
ఈ కొత్త టెక్నాలజీ అనేది ముఖ్యమైన సవాలును ఎదుర్కొంటోంది. ప్రస్తుతం భారతీయ రోడ్లపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, భారత ఆర్మీ, అనేక అత్యవసర సర్వీసుల వాహనాలతో సహా కొన్ని వాహనాలకు టోల్ పన్నుల నుంచి మినహాయింపు ఉంది.
ఏఐ (AI) వ్యవస్థలు కొన్నిసార్లు ఈ వాహనాలను సాధారణ వాహనాలుగా పొరపాటుగా భావించి తప్పుగా జరిమానాలు లేదా ఇ-నోటీసులను జారీ చేయొచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈ స్పెషల్ వెహికల్స్ కోసం ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ ఫాస్టాగ్‌ను జారీ చేయాలని యోచిస్తోంది. ఈ ఫాస్టాగ్ సాధారణ ఫాస్టాగ్ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ, టోల్ వసూలు చేయదు. ఒక వెహికల్ హైవేలోని ఏఐ టోల్ సిస్టమ్ గుండా వెళ్ళగానే ఆ సిస్టమ్ వెహికల్ గుర్తించి ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్లేలా చూస్తుంది. తద్వారా తప్పుడు చలాన్లు లేదా జరిమానాలు పడకుండా నివారించవచ్చు. భద్రతా సంస్థలకు ఎలాంటి సమస్యలు తలెత్తవు అనమాట.
Read Also : Internet Shutdown Apps : ఇరాన్ కేబుల్స్ కట్ చేస్తుందట..! లో ఇంటర్నెట్, నో ఇంటర్నెట్తో పనిచేసే యాప్స్ ఇవే..
ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. అందులో ఫస్ట్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏఐ టోల్ వ్యవస్థకు నేరుగా లింక్ చేసిన అన్ని టోల్-రహిత వాహనాలతో భారీ సెంట్రల్ డేటాబేస్‌ను క్రియేట్ చేయడం.. ఇక రెండో ప్రత్యామ్నాయం ఏంటంటే.. ఇలాంటి విభాగాలు, ఏజెన్సీలకు ప్రత్యేకమైన అన్ లిమిటెడ్ ఫ్రీ ట్రావెల్ ఫాస్టాగ్‌లను అందించాలని భావిస్తోంది.
ఇలాంటి వాహనాలకు స్పెషల్ కేర్ :
సైనిక, రక్షణ వాహనాల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆర్బీ వెహికల్స్ వాటి స్పెషల్ డిఫెన్స్ లైసెన్స్ ప్లేట్ల ద్వారా గుర్తించవచ్చు. ఇలాంటి వాహనం టోల్ కారిడార్‌ను దాటిన వెంటనే సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా, ఏదైనా సున్నితమైన డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు డేటాను వెంటనే సిస్టమ్ డిలీట్ చేస్తుంది.
ఈ స్పెషల్ సౌకర్యం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అందుబాటులో ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ఇతర అధికారులకు చెందిన ప్రైవేట్ వాహనాలు కచ్చితంగా అధీకృత ప్రభుత్వ పనుల మీద మాత్రమే టోల్ మినహాయింపుకు అర్హత పొందుతాయి. అంటే.. ఈ ప్రత్యేక సౌకర్యం సాధారణ వ్యక్తిగత వినియోగానికి అందుబాటులో ఉండదు.
స్పెషల్ ఫాస్టాగ్‌ను పొందే ప్రాసెస్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. బ్యాంకు లేదా ఏదైనా స్టోర్ నుంచి తీసుకోలేరు. వాహన యజమానులు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) పోర్టల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. వాహనం, ఆర్సీ, సంబంధిత శాఖ నుంచి అధికార పత్రం, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వెరిఫై తర్వాత వాహనానికి జీరో-బ్యాలెన్స్ స్పెషల్ ఫాస్టాగ్‌ను జారీ చేస్తారు.
