OG Universe : మళ్ళీ మొదలెట్టార్రోయ్.. ఫ్యాన్స్ కి పండగే.. ఈసారేంటి OG ఇంత ఫాస్ట్ గా.. ముగ్గురి ఫోటో వైరల్..
సుజీత్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద ఫాస్ట్ గా వర్కౌట్ చేస్తున్నారు. (OG Universe)
OG Universe
OG Universe : పవన్ కెరీర్లో భారీ విజయం సాధించి, ఫ్యాన్స్ ని మెప్పించిన సినిమా OG. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేసారు. సడెన్ గా ఇప్పుడు మాత్రం వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఇటీవలే OG యూనివర్స్ ప్రకటించి నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసారు. సుజీత్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద ఫాస్ట్ గా వర్కౌట్ చేస్తున్నారు.
ఇప్పటికే సుజీత్, పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్ చేయడం, పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ట్వీట్ వేయడం, ఈ సినిమాని తన సొంత బ్యానర్లో నిర్మిస్తుండటంతో ఫ్యాన్స్ ఇప్పట్నుంచే హైప్ పెంచుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల డేట్స్ లేట్ గా ఇస్తారేమో, సినిమా ఆలస్యం అవుతుందేమో అనుకుంటున్నారు అంతా. కానీ సుజీత్ రోజుకొక అప్డేట్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
Also Read : Fake Collections : మొన్న నాగవంశీ.. ఇవాళ దిల్ రాజు.. అన్ని ఫేక్ కలెక్షన్స్.. ఇప్పటికైనా ఫ్యాన్స్ మారతారా?
ఇవాళ మధ్యాహ్నం OG యూనివర్స్ మ్యూజిక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా తమన్ ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తో తమన్, సుజీత్ కలిసి గన్స్ పట్టుకున్నట్టు స్టైల్ గా ఫోజులిచ్చి దిగిన ఫోటోను తన తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. OG సినిమాకు తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. మెగా ఫ్యాన్స్ తమన్ ని ఆకాశానికెత్తేశారు. అప్పుడు కూడా సుజీత్, తమన్ కలిసి పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కి నచ్చినట్టు మార్చడంతో ఈ ముగ్గుర్ని ఫేమస్ మీమ్ 3 డ్రాగన్స్ తో పోలుస్తూ వైరల్ చేసారు.
ఇప్పుడు కూడా మళ్ళీ అలా చూపించడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో షేర్ చేసి త్వరలో సూపర్ వీడియో రాబోతుంది అని ప్రకటించాడు తమన్. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుకొక అప్డేట్ ఇస్తుంటే ఈసారి మాత్రం OG సీక్వెల్ ఫాస్ట్ గానే అయ్యేట్టు కనిపిస్తుంది అంటున్నారు.
With Our Honourable Deputy Chief Minister 🔥@APDeputyCMO #Leader Shri @PawanKalyan gaaru
And Dear @Sujeethsign 🫠💥
And a super Cool Video Coming up Super Soon 🎙️🏆On #OgUniverse Musicology 🚀🚀🚀 pic.twitter.com/JhyzZpTcOI
— thaman S (@MusicThaman) June 27, 2026
