SIR Enumeration Form Online : ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ నిపండం ఎలా? స్టెప్ బై స్టెప్
SIR Enumeration Form Online : తెలంగాణలో సర్ ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ నింపే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు..
SIR Enumeration Form Online
SIR Enumeration Form Online : దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోకూడా సర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే, బీఎల్వో కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో కూడా ఎన్యుమరేషన్ ఫారం నింపే అవకాశం ఉంది.
Also Read : Telangana SIR : ఏపీలో ఓటుంటే ఇక్కడ SIRలో పేరు నమోదు చేసుకోవచ్చా?
సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. బీఎల్వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఆ ఫారాలను ఎలా నింపాలో వారు వివరంగా చెబుతారు. బీఎల్వోలు ఇచ్చిన రెండు ఫారాలను నింపిన తరువాత ఒకటి వారు తీసుకొని.. రెండో ఫారాన్ని రశీదుగా మనకు అందజేస్తారు. ఒకవేళ బీఎల్వో ఇంటికి రాకపోతే సంబంధిత బీఎల్వో ఫోన్ నంబర్‌ను రాష్ట్ర ఎన్నికల శాఖ వెబ్సైట్ లేదా ECI యాప్ ద్వారా తెలుసుకుని సంప్రదించవచ్చు. అలాగే ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్ 1950కు కాల్ చేసి కూడా సమాచారం పొందే అవకాశం ఉంది. లేదంటే ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ ఫామ్ ను పూర్తి చేయొచ్చు.
ఆన్లైన్లో ఫారం ఇలా పూర్తి చేయాలి..
♦ ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ నింపే అవకాశం ఉంది.
♦ ముందుగా https:voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి.
♦ ఓటర్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లేదా EPIC నెంబర్‌ను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
♦ మీ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.
♦ లాగిన్ అయ్యాక Fill Enrollment Form అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫామ్ నింపొచ్చు.
♦ ఫామ్ నింపడం పూర్తయ్యాక E-Sign పేజీకి డైవర్ట్ అవుతుంది.
♦ ఆ తర్వాత ధ్రువీకరణకోసం మళ్లీ మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
♦ ఓటీపీ ఎంటర్ చేశాక మీ ఫామ్ అప్లోడ్ అవుతుంది.
