Telugu film Director Om Ramesh krishna missing
ఓ సినీ దర్శకుడు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దర్శకుడు అదృశ్యం అయ్యాడు. తెలుగు మూవీ డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) కనిపించకుండా పోయారు. ఫ్రెండ్స్ కాలనీలో ఓం రమేష్ కృష్ణ నివాసం ఉంటున్నారు. నిన్న ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం అంతా వెతికారు.
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష.. జడ్జి ఫుల్ సీరియస్
ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆయన భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదంటూ ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సినీ పరిశ్రమలో అతడితో కలిసి పని చేసిన వారిని, స్నేహితులను విచారిస్తున్నారు పోలీసులు. కావాలనే ఆయన వెళ్లిపోయారా.? లేదంటే మరేదైనా జరిగిందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.