OTT Releases : ఈరోజు ఓటీటీలో ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయా..!

ఈవారం థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా అరడజను వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ టు హాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ లిస్టు అండ్ అవి ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకొని ఎంజాయ్ చేసేయండి.

OTT Releases : ఈరోజు ఓటీటీలో ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయా..!

Telugu Movies OTT Releases in this week details

Updated On : February 9, 2024 / 10:51 AM IST

OTT Releases : ఈవారం థియేటర్స్ లో అరడజను వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల పండుగ థియేటర్స్ వరుకే ఉండిపోలేదు, ఓటీటీలో కూడా అరడజనకు పైగా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ టు హాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్.. ఆల్రెడీ ఓటీటీకి వచ్చేశాయి. మరి ఆ చిత్రాలు ఏంటో చూసి, అవి ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకొని.. చూసి ఎంజాయ్ చేసేయండి.

గుంటూరు కారం..
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గుంటూరు కారం’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

బబుల్‌గమ్..
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘బబుల్‌గమ్’. దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన ఈ చిత్రం న్యూ ఏజ్ లవ్ స్టోరీతో యూత్ ని బాగానే ఆకట్టుకుంది. ఆహాలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Also read : Eagle Twitter Review : రవితేజ ‘ఈగల్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

కెప్టెన్ మిల్లర్..
తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.

రెబల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం..
క్రైమ్‌ కామెడీ డ్రామాగా జైదీప్‌ విష్ణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెబల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం’.. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది.

Also read : Lal Salaam Twitter Review : రజినీకాంత్ ‘లాల్ స‌లామ్‌’ ట్విట్టర్ టాక్ ఏంటి.. ఆడియన్స్ ఏమంటున్నారు..?

ది మార్వెల్స్..
మర్వెల్ హీరో యూనివర్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో సినిమా ‘ది మార్వెల్స్’. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్స్ లో ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

ది నన్ 2..
హాలీవుడ్ హారర్ మూవీ ‘ది నన్ 2’.. బుల్లితెరపై భయపెట్టేందుకు జియో సినిమాస్ ఓటీటీకి వచ్చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ది ఎక్సర్సిస్ట్ బిలీవర్..
మరో హాలీవుడ్ హారర్ మూవీ ‘ది ఎక్సర్సిస్ట్ బిలీవర్’ కూడా ఈ వారమే ఓటీటీకి వచ్చేసింది. ఈ చిత్రం కూడా జియో సినిమాస్ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.

అయలాన్..
శివకార్తికేయన్, రకుల్ జంటగా ఏలియన్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సైఫై కామెడీ సినిమా ‘అయలాన్’.. సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇది కేవలం తమిళ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యింది.