శివరాత్రి జాగరం – అర్థరాత్రి ఆటల సందడి!

మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌లో ప్రత్యేక ప్రదర్శనలు..

  • Published By: sekhar ,Published On : February 21, 2020 / 09:29 AM IST
శివరాత్రి జాగరం – అర్థరాత్రి ఆటల సందడి!

Updated On : February 21, 2020 / 9:29 AM IST

మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌లో ప్రత్యేక ప్రదర్శనలు..

ఫిబ్రవరి 21 మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ ప్రాంతం అర్థరాత్రి స్పెషల్ షోలతో సందడిగా మారనుంది. ఈ ఏరియాలో ఉన్న ఆరు థియేటర్లలోనూ అర్థరాత్రి సినిమాలు ప్రదర్శించనున్నారు. సెకండ్ షో తర్వాత రాత్రి 12 గంటలనుండి షోలు స్టార్ట్ కాబోతున్నాయి.

దేవి 70ఎమ్ఎమ్‌లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సూపర్ హిట్ బొమ్మ ‘వాల్మీకి’, సుదర్శన్ 35లో ‘ప్రతిరోజూ పండగే’ సంధ్య 70 ఎమ్ఎమ్‌లో 12 గంటలకు గతేడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘ఎఫ్ 2’, 2:30 నిమిషాలకు ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రదర్శించనున్నారు.

శ్రీ మయూరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’.. సప్తగిరిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’, విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ సినిమాలు శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.  

Read More>>పెన్సిల్ ముల్లుపై శివలింగం : మైక్రో ఆర్ట్ కళాకారుడి ప్రతిభ

See Also>>డోలమైట్స్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం