Record Break Movie : ‘రికార్డ్ బ్రేక్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. బాక్సింగ్ స్టోరీతో సరికొత్తగా..

స్పోర్ట్స్ డ్రామాతో రూపొందుతున్న 'రికార్డ్ బ్రేక్' మూవీ ట్రైలర్ రిలీజ్. బాక్సింగ్ స్టోరీతో సరికొత్తగా..

Telugu New sports backdrop movie Record Break trailer release

Record Break Movie : స్పోర్ట్స్ డ్రామా ఫిలిమ్స్ ఆడియన్స్ ని ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అదే నేపథ్యంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. బాక్సింగ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాని చదలవాడ శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

అనాథులుగా పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల..పహిల్వాన్లుగా ఎదుగుతారు. సాధారణ జీవనాన్ని సాగిస్తున్న వారి లైఫ్ లోకి ఒక అమ్మాయి ఆపదతో వస్తుంది. తనని ఆ ఆపద నుంచి రక్షించిన ఆ బ్రదర్స్ ని చూసిన ఆ అమ్మాయి.. వారిని కుస్తీ ఫైటర్స్ గా మార్చాలని అనుకుంటుంది. ఆ తరువాత వాళ్ళు శిక్షణ తీసుకోని దేశం కోసం ఎలా ఫైట్ చేసారు అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

Also read : Oka Pathakam Prakaaram : ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్‌తో.. సాయిరామ్‌ శంకర్ కొత్త సినిమా..

కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమాని అందించిన దర్శకులు అజయ్ కుమార్, నిర్మాత రామ సత్యనారాయణ, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన చిత్రం అని, ఈ మూవీ మంచి విజయం అందుకుంటుందని వ్యాఖ్యానిస్తూ చిత్ర యూనిట్ ని అభినందించారు. కాగా ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.