Oka Pathakam Prakaaram : ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్‌తో.. సాయిరామ్‌ శంకర్ కొత్త సినిమా..

ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్‌తో సాయిరామ్‌ శంకర్ కొత్త సినిమా. ‘ఒక పథకం ప్రకారం’ మూవీ రిలీజ్..

Oka Pathakam Prakaaram : ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్‌తో.. సాయిరామ్‌ శంకర్ కొత్త సినిమా..

Sai Raam Shankar Ashima Shruti Oka Padhakam Prakaram release date update

Updated On : February 19, 2024 / 11:54 AM IST

Oka Pathakam Prakaaram : పూరిజగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిరామ్‌ శంకర్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఈమధ్య కాలంలో సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన సాయిరామ్.. ఇప్పుడు వరస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ‘ఒక పథకం ప్రకారం’ అనే సినిమాని రెడీ చేస్తున్నారు.

సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న వినోద్‌ విజయన్‌.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. అంతేకాదు, ఈ సినిమా కోసం ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్‌ టెక్నీషియన్స్ గా పని చేస్తుండడం గమనార్హం. విభిన్నమైన కథాంశంతో థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Also read : Anupama Parameswaran : అనుపమ అభిమాని ఆవేదన వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..

ఈ సినిమాలో సాయిరామ్‌ శంకర్‌ పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రని పోషిస్తున్నారట. అలాగే మరో స్టార్ నటుడు సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. రాహుల్ రాజ్ సంగీతం అందిస్తుండగా, మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ సినిమాకి మరో హైలైట్ కాబోతున్నారు. వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. టీజర్ కూడా మంచి స్పందన అందుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. మార్చిలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. త్వరలో కచ్చితమైన డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.