అజిత్‌కు ప్రమాదం.. హాస్పిటల్లో చికిత్స..

  • Publish Date - November 19, 2020 / 07:37 PM IST

Thala Ajith: తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్‌ మంచి బైక్ రేసర్ అనే సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఒకసారి ‘వలిమై’ సినిమా షూటింగులోనే గాయపడ్డ అజిత్ తాజాగా మరోసారి ప్రమాదానికిగురయ్యారు. అజిత్ స్వయంగా డూప్ లేకుండా బైక్ చేజ్ స్టంట్స్ చేస్తున్నారు.


బైక్‌తో రిస్కీ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరగడంతో అజిత్‌ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో అజిత్ కొన్ని రోజులు షూటింగ్‌‌ నుంచి బ్రేక్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


అజిత్ ప్రమాదానికి గురయ్యారని తెలియగానే కోలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాల వారు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ‘వలిమై’ షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అజిత్ పక్కన హ్యూమా ఖురేషి హీరోయిన్‌‌గా నటిస్తోంది.