Site icon 10TV Telugu

సూపర్ స్టార్ రజనీ 168 ‘అన్నాతే’

Thalaivar 168 is Annaatthe

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 168వ సినిమా టైటిల్ వీడియో..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. రజనీ నటిస్తున్న 168వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

లేడి సూపర్ స్టార్ నయనతార ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తలైవర్ 168 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు పేరు ఫిక్స్ చేశారు. ‘అన్నాతే’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.

 

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘అన్నాతే’ త్వరలో విడుదల కానుంది. సమర్పణ : కళానిధి మారన్, సంగీతం : డి. ఇమాన్, కెమెరా : వెట్రి పళనిస్వామి, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్. 

 

Exit mobile version