Thalapathy Vijay doing another Telugu Film ready to release on upcoming Sankranti
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించారు. ఇక్కడ కూడా పలువురు విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ కి మంచి మార్కెట్ ఉంది. గత సంక్రాంతికి విజయ్ తమిళ్ – తెలుగు బైలింగ్వల్ సినిమా వారసుడు(వరిసు)తో వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.
ఇప్పుడు మరోసారి విజయ్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు అని సమాచారం. RRR సినిమా నిర్మించిన DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా ఉందని, త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటించి సమ్మర్ లో షూటింగ్ మొదలుపెట్టి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా కూడా తెలుగు – తమిళ్ బైలింగ్వల్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది.
ఇప్పటికే వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, ప్రశాంత్ వర్మ సినిమాలు ఉండగా ఇప్పుడు విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తుందని సమాచారం. అయితే విజయ్ గత సినిమా వారసుడు లాగే రాబోయే ఈ సినిమా కూడా ఎక్కువగా తమిళ్ మార్కెట్ మీదే ఫోకస్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు. ఇక మరోపక్క విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాడని, ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించారని, తమిళనాడు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ తన 68వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ తెలుగు సినిమా, తర్వాత ఇంకో సినిమా.. 70 సినిమాలు అయ్యాక పార్టీ పనులు మొదలుపెట్టి రంగంలోకి దిగుతాడని తెలుస్తుంది.