Geeta Singh : ‘కితకితలు’ కంటే ముందే గీతా సింగ్ అల్లరి నరేష్ అన్నయ్య సినిమాలో.. అప్పుడు ఎంత సన్నగా ఉందో తెలుసా?

గీతా సింగ్ మనందరికీ కితకితలు సినిమా నుంచే తెలుసు. కానీ గీతా సింగ్ సన్నగా ఉన్నప్పటి నుంచే సినిమాలు చేసింది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

Geeta Singh : ‘కితకితలు’ కంటే ముందే గీతా సింగ్ అల్లరి నరేష్ అన్నయ్య సినిమాలో.. అప్పుడు ఎంత సన్నగా ఉందో తెలుసా?

Geeta Singh play a character in Aryan Rajesh Movies before Allari Naresh Kitakitalu

Updated On : January 31, 2024 / 9:11 AM IST

Geeta Singh : కితకితలు(Kitakitalu) సినిమాతో గీతా సింగ్ బాగా పాపులర్ అయింది. అల్లరి నరేష్ భార్యగా, లావుగా ఉన్న అమ్మాయి పాత్రలో కనపడి గీతా సింగ్ ప్రేక్షకులని మెప్పించింది. ఆ సినిమా తన కెరీర్ కి బాగా ప్లస్ అయింది. అయితే కితకితలు కంటే ముందే గీతా సింగ్ చాలా సినిమాల్లో నటించింది. మొదట్లో గీతా సన్నగానే ఉండేది. థైరాయిడ్ సమస్య రావడం వల్ల గీతా సింగ్ లావు అయింది. మొదట్లో ఆ లావు గురించి భయపడినా ఆ లావు వల్లే తనకు అవకాశాలు రావడంతో దాని గురించి ఆలోచించడం మానేసింది.

గీతా సింగ్ మనందరికీ కితకితలు సినిమా నుంచే తెలుసు. కొంతమందికి అల్లరి నరేష్(Allari Naresh) అన్నయ్య ఆర్యన్ రాజేష్(Aryan Rajesh) ఎవడిగోల వాడిదే సినిమా నుంచి తెలుసు. అందులో కూడా లావుగానే ఓ పాత్రలో కనిపిస్తుంది. కానీ గీతా సింగ్ సన్నగా ఉన్నప్పటి నుంచే సినిమాలు చేసింది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కితకితలు, ఎవడిగోల వాడిదే సినిమాల కంటే ముందే గీతా సింగ్ ఆర్యన్ రాజేష్ శంభు సినిమాలో ఓ పాత్ర చేసింది. ఆ సినిమాలో ఆర్యన్ రాజేష్ కాలేజీ ఫ్రెండ్స్ లో ఒకరిగా ఉంటుంది. అప్పుడు గీతా సన్నగానే ఉంటుంది. ఈ విషయాన్ని అల్లరి నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Also Read : Shah Rukh Khan : ఫ్యాన్స్ నన్ను ప్రశ్నించారు.. ఇకపై ఎక్కువ గ్యాప్ తీసుకోను..

ఇక గీతా సింగ్ కి అల్లరి నరేష్, వాళ్ళ నాన్న దర్శకుడు EVV సత్యనారాయణ అంటే ఎంతో అభిమానం. EVV గారివల్లే ఎవడిగోల వాడిదే, కితకితలు సినిమాలతో తనకి లైఫ్ వచ్చిందని, అల్లరి నరేష్ తనకి లైఫ్ లో, కెరీర్ లో ఎంతో సపోర్ట్ గా నిలిచారని గీతా సింగ్ గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. అయితే వారిద్దరి కంటే ముందే ఆర్యన్ రాజేష్ సినిమాలో నటించింది. ఇలా వాళ్ళ ఫ్యామిలీ అందరితో గీతా సింగ్ కి మంచి అనుబంధమే ఉంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది గీతా సింగ్.