Thalapathy Vijay : 10 గంటలు పైగా స్టేజిపై నించొని.. 1000 మందికి పైగా స్టూడెంట్స్ కి సన్మానం చేసి.. వైరల్ అవుతున్న తలపతి విజయ్..

ఈ కార్యక్రమంలో విజయ్ దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు స్టేజిపై సన్మానం చేసి, బహుమతులని అందించారు. అంతేకాక వారందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు దిగారు. ఆ విద్యార్థులని ఫ్యామిలీలతో స్టేజిపైకి పిలిచి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.

Thalapathy Vijay felicitate toppers in 10th and inter across from tamilanadu and give photos to all

Thalapathy Vijay :  తమిళ్ స్టార్ హీరో విజయ్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. విజయ్ సినిమా రిలీజ్ అయితే తమిళ్ థియేటర్స్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక విజయ్ అభిమానులతో చాలా మంచిగా ఉంటారు. అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. తాజాగా విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. విజయ్ అభిమానుల సంఘం తరపున ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిలో తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ తో సన్మానం చేయించి ఒక్కొక్కరికి అయిదువేల రూపాయలు బహుమతి అందించారు.

అయితే ఈ కార్యక్రమంలో విజయ్ దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు స్టేజిపై సన్మానం చేసి, బహుమతులని అందించారు. అంతేకాక వారందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు దిగారు. ఆ విద్యార్థులని ఫ్యామిలీలతో స్టేజిపైకి పిలిచి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ ఫ్యామిలీలలో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని ఎత్తుకొని ఫోటోలు దిగారు. స్టేజిపైకి వచ్చిన స్టూడెంట్స్ అడిగినట్టు వాళ్లకు ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ కార్యక్రమం, విజయ్ స్టూడెంట్స్ తో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. అలాగే వారందరికీ విజయ్ భోజనం కూడా ఏర్పాటు చేశారు.

Vijay : రాజకీయాలపై మొదటిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన తమిళ్ స్టార్ హీరో విజయ్.. టార్గెట్ 2026?

ఇక ఈ కార్యక్రమంలో దాదాపు విజయ్ 10 గంటలకు పైగా స్టేజిపై నించొని ఉన్నారు. దీంతో మధ్యలో కాసేపు అలసిపోయి స్టేజిపై ఉన్న బల్లను ఆసరాగా చేసుకొని నిలబడ్డారు. ఎక్కువసేపు నించోవడంతో ఓపిక అయిపోవడంతో మధ్యలో కొద్దిగా బ్రేక్ తీసుకున్నారు. దీంతో స్టేజిపై విజయ్ నిలబడటానికి కష్టంగా ఫీల్ అయిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అభిమానుల కోసం, స్టూడెంట్స్ కోసం అంతసేపు నించొని, వారందరికీ ఫోటోలు ఇచ్చారని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు