Thaman : A Nostalgic Movie for every 90s kids..
Thaman : సౌత్‌లో బడాబడా హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ, సినిమాలకు తన నేపధ్య గానంతో ప్రాణం పోస్తూ, ఇటీవలే నేషనల్ అవార్డు కూడా అందుకున్న థమన్ కెరీర్ మొదట్లో తమిళ దర్శకుడు శంకర్ చిత్రీకరించిన బాయ్స్ సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా విడుదలై 19 ఏళ్లు పూర్తవ్వడంతో ఆ సినిమా థమన్‌కు ఎంత ప్రత్యేకమో ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
2003లో రిలీజ్ అయిన బాయ్స్ మూవీ అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపింది అనే చెప్పాలి. టీనేజ్‌లో ఉన్న యువత తొందరపాటు తనంతో చేసే తెలిసి తెలియని తప్పులని, అలానే వారి మనస్తత్వాన్ని చాలా నేచురల్‌గా చూపించడంతో అప్పటి యువత ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా ‘పదహారు ప్రాయంలో నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి’ అంటూ సాగే పాట మాత్రం ప్రతి ఒక్క అబ్బాయిని ఆకట్టుకుంది.
దీనిలో సిద్దార్ద్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. AR రెహ్మాన్ బాణీలు అందించగా ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా తనకి ఎంత ప్రత్యేకమో ఇప్పటికి థమన్ చాలా వేదికల మీద చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలై 19 ఏళ్లు పూర్తీ కావ్వడంతో..90’S కిడ్స్‌కి ఈ సినిమా ఒక వ్యామోహం లాంటిది అని తన ట్విట్టర్ ఖాతా నుంచి ఒక ఫోటో ద్వారా పంచుకున్నారు. దాన్ని నెటిజన్లు కూడా షేర్‌లు చేస్తున్నారు.
#Boys ?#19yearsOfBoys pic.twitter.com/3hq1Kqr4GR
— thaman S (@MusicThaman) August 29, 2022