×
Ad

OG Sequel: ఓజీ 2..3..4..5 వస్తూనే ఉంటాయ్.. ఇది లైఫ్ టైం జర్నీ.. పవన్ కళ్యాణ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు

ఓజీ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన కథలో వేసుకున్నాడు లేటెస్ట్ (OG Sequel)మ్యూజిక్ సెన్సేషన్ తమన్. తన పవర్ ఫుల్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు.

Thaman makes interesting comments on Pawan Kalyan's OG sequel

OG Sequel: ఓజీ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన కథలో వేసుకున్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్. తన పవర్ ఫుల్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఒక రకంగా చెప్పాలంటే ఓజీ సినిమాకి మెయిన్ హీరో అంటే తమన్ అనే చెప్పాలి. స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతీసారి తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో అదిరిపోయే ఎలివేషన్ అందించాడు తమన్. ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో (OG Sequel)ఉన్నారు. ఆయన బయట కనిపిస్తే గుడి కట్టేసేలా ఉన్నారు. అంతలా తమన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

Ram Charan: రామ్ చరణ్ 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్

ఇక భారీ సక్సెస్ కు కారణమైన తమన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూలో ఓజీ సినిమా గురించి ఒక్కో సీక్రెట్ రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే, ఓజీ సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు తమన్. ఓజీ సీక్వెల్ ఉంటుందా అని యాకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా తమన్ మట్లాడుతూ.. “ఓజీ అనేది లైఫ్ టైం జర్నీ. ఒక సీక్వెల్ తో ఆగడు. రెండు, మూడు, నాలుగు ఇలా వస్తూనే ఉంటాయి. సుజీత్ కూడా ఓజీని ఇప్పుడప్పుడే వేదిలీలా లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ ప్రాజెక్టుపై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కాబట్టి, ఓజీ సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. అవి కూడా పవన్ కళ్యాణ్ గారే చేస్తారు”అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు తమన్.

తమన్ నుంచి ఈ మాటలు విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే లాస్ట్ సినిమా అనుకున్నారు కానీ, ఇంకా ఆయన సినిమాలు చేస్తారు అని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ సీక్వెల్స్ రావడానికి మాత్రం చాలా టైం పెట్టె ఆవకాశం ఉంది. ఇక ఓజీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలకు ముందే భారీ అంచనాల ఉన్న ఈ సినిమా మొదటి రోజే రూ.154 కోట్ల భారీ ఓపెనింగ్స్ ని సాధించింది.