Thaman
Thaman : ప్రభాస్ రాజాసాబ్ సినిమా జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో మొదటిసారి హారర్ ఫాంటసీ నేపథ్యంలో ప్రభాస్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.(Thaman)
రాజాసాబ్ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించాడు. తమన్ ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఇచ్చాడు. తాజాగా నిన్న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రాజాసాబ్ లో ఒక సాంగ్ పై తమన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Rajasaab Press Meet : ప్రభాస్ లేకుండానే.. రాజాసాబ్ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫోటోలు..
ఇటీవల రాజాసాబ్ సినిమా నుంచి నాచే నాచే.. సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ సాంగ్ ని తీసుకొని రీమిక్స్ చేసారు. ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టాడు. బాలీవుడ్ లో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఆ పాట మీదే తమన్ కామెంట్స్ చేసాడు.
తమన్ మాట్లాడుతూ.. రీమిక్స్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ అసలు ఇష్టపడరు. ఈ ప్లాన్ మారుతి స్క్రిప్ట్ చేసినప్పటి నుంచే ఉంది. మధ్యలో వచ్చింది కాదు. హీరోతో ముగ్గురు హీరోయిన్స్ తో ఒక రీమిక్స్ సాంగ్ పెడతామని వాళ్లకు ప్లాన్ ఉంది. నేను ఇంక దానికి అలవాటు పడ్డాను. నాకు కూడా ఇలాంటి పెద్ద కటౌట్ హీరో ఉన్నప్పుడు, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఒక మంచి మాస్ సాంగ్ చేయాలని ఉంటుంది.
కుర్చీ మడతపెట్టి లాంటి మాస్ పాట చేయాలనుకున్నాను. కానీ ఈ విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత తెలిసింది ఈ సినిమాకు ఈ పాటే కరెక్ట్. పాట వచ్చిన తర్వాత అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ పాట కరెక్ట్ అనిపించింది. హీరో హార్ట్ పెట్టి పనిచేసారు ఈ సాంగ్ కి. ప్రభాస్ ఫిక్స్ అయ్యారు ఈ పాటకు డ్యాన్స్ వేయాలి కుమ్మేయాలి అని . అదే మనకు ఆ పాటలో కనిపిస్తుంది అని అన్నారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Also Read : Rajasaab Movie : ప్రభాస్ సినిమాకు థియేటర్స్ ఇష్యూ..? థియేటర్స్ ఇవ్వకపోతే.. SKN స్పీచ్ వైరల్..
తమన్ కొత్త మాస్ సాంగ్ ఇద్దామనుకుంటే మారుతినే ఇలా హిందీ సాంగ్ రీమిక్స్ చేద్దామనుకున్నట్టు తెలుస్తుంది. పాట, విజువల్స్, ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ డ్యాన్స్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు ఈ పాట విషయంలో.
తమన్ మాట్లాడింది ఈ సాంగ్ గురించే..