Thaman
Thaman : మన రోజు వారి జీవితంలో పాటలు వినడం సర్వ సాధారణం. పల్లెటూళ్ళో రేడియోనో, టీవీనో పెట్టుకొని పాటలు వినే దగ్గర్నుంచి సిటీలో చేతుల్లో మొబైల్స్ పట్టుకొని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేదాకా ప్రతి ఒక్కరికి పాటలే కాలక్షేపం. అందుకే సినిమాల్లో పాటలకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పాటలు బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే అని నమ్ముతారు. హిట్ పాటల్ని చూసి సినిమాకి వచ్చే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. ఇటీవల కాలంలో పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. లిరికల్ వీడియోలుగా ముందే రిలీజ్ అయి కొన్ని వందల మిలియన్ల వ్యూస్ సంపాదించి అటు సినిమాకి పేరు, ఇటు ఆడియో కంపెనీలకి డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.
ఒక పాట బాగా రావాలంటే దానికి మ్యూజిక్ చాలా ప్రాణం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని బట్టి కూడా ఆ పాటకి క్రేజ్ ఉంటుంది. ఇక పాట బాగుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. స్టార్ హీరోల సినిమాలకి సంగీతం అందిస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన పలు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ వచ్చి రికార్డులు సాధించాయి. ప్రస్తుతం తమన్ సూపర్ స్టార్ మహేష్ సినిమా ‘సర్కారు వారి పాటకి’ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి, పెన్నీ పెన్నీ సాంగ్స్ భారీగా హిట్ అయ్యాయి. ఈ సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
Rukshar Dhillon : ప్రేమ పెళ్లి చేసుకుంటాను.. నాకు అలాంటి అబ్బాయి కావాలి..
ఈ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. ” పాటలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయాయి. ఓ పాట హిట్ అవ్వాలంటే అది ఏ సింగర్‌తో పాడించాలి? ఆ సాంగ్ లైన్ గ్లోబల్‌గా ఉందా? లేదా? లిరికల్ వీడియో ఎలా చేయాలి? ఇలాంటివన్నీ చాలా ముఖ్యంగా మారాయి. వాటిని చాలా బాధ్యతగా చూసుకోవాలి. ఒక్కో పాట కొన్ని వందల మిలియన్ వ్యూస్ సాధించడమంటే మామూలు విషయం కాదు. పాటలు బాగుండి రీచ్ వస్తున్నాయి కాబట్టి లిరికల్ వీడియోలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఆడియో కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాళ్ళ లెక్కలు వాళ్లకి ఉంటాయి” అని తెలిపారు.