Thaman : తమన్ పై ట్రోల్స్.. మొదటిసారి స్పందించిన తమన్ భార్య.. భార్యగా బాధగా ఉంటుంది కానీ..

తమన్ భార్య శ్రీ వర్దిని ఒక సింగర్. పలు సినిమాలలో సింగర్ గా పాడింది. పలు టీవీ షోలలోను పాడి గుర్తింపు తెచ్చుకుంది వర్దిని. తాజాగా వర్దిని ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తమన్ పై వచ్చే ట్రోల్స్ గురించి స్పందించింది.

Thaman : తమన్ పై ట్రోల్స్.. మొదటిసారి స్పందించిన తమన్ భార్య.. భార్యగా బాధగా ఉంటుంది కానీ..

Thaman Wife Vardini reacts about Trolls on Thaman

Updated On : June 12, 2023 / 10:19 AM IST

Sri Vardini :  మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Music Director Thaman) ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో, చేతి నిండా పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే అప్పుడప్పుడు తమన్ మ్యూజిక్ కాపీ కొడతాడని, వేరే పరిశ్రమల సాంగ్స్, వేరే సినిమాల సాంగ్ తీసుకొచ్చి వాటిని మార్చి ఇస్తుంటాడని ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో తమన్ కి చాలా నెగిటివ్ ఉంది. సోషల్ మీడియాలో తమన్ ని ట్రోల్ చేస్తూనే ఉంటారు.

గతంలో తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ట్రోల్స్ పై స్పందించిన తమన్ వ్యాఖ్యలను కూడా పలువురు ట్రోల్ చేశారు. తమన్ నుంచి కొత్త సాంగ్ వచ్చిందంటే అదెక్కడి నుంచి కాపీ కొట్టాడా అని వెతుకుతారు నెటిజన్లు. అది ఏ మ్యూజిక్ కి అయినా సింక్ అయితే ఇంక ట్రోల్స్ మొదలుపెడతారు. ఇది చాలా కామన్ విషయం అయింది. మొదట తమన్ స్పందించినా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడు. తాజాగా తమన్ పై వచ్చే ట్రోల్స్ గురించి తమన్ భార్య వర్దిని స్పందించింది.

Avika Gor : సౌత్‌ లో నెపోటిజం చాలా ఎక్కువ.. సౌత్ సినిమాపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన అవికా గోర్..

తమన్ భార్య శ్రీ వర్దిని ఒక సింగర్. పలు సినిమాలలో సింగర్ గా పాడింది. పలు టీవీ షోలలోను పాడి గుర్తింపు తెచ్చుకుంది వర్దిని. తాజాగా వర్దిని ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తమన్ పై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. తమన్ ఇంటర్వ్యూలు చూస్తాను. కానీ వీడియోల కింద వచ్చే కామెంట్స్ గురించి మాత్రం చదవను. సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ కూడా పట్టించుకోను. నేను చాలా సెన్సిటివ్ పర్సన్ ని. నా భర్తపై వచ్చే ట్రోల్స్ చూస్తే బాధగానే ఉంటుంది. అందుకే అవి పట్టించుకోను. మా ఇద్దరి మధ్య కూడా ఆ ట్రోల్స్ గురించి ఎప్పుడూ చర్చ రాదు. ఇంట్లో అస్సలు వీటి గురించి మాట్లాడరు. తమన్ ని ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, అభినందించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని తెలిపింది.